న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆర్‌సీబీ ఐపీఎల్ టైటిల్‌ ఎందుకు గెలవలేదో చెప్పిన కోహ్లీ!!

Virat Kohli opens up on why RCB haven’t won an IPL title yet


ఢిల్లీ:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు (ఆర్‌సీబీ) ఇప్పటిదాకా టైటిల్‌ గెలవలేదు. ఇప్పటికే ఐపీఎల్ టోర్నీ 12 సీజన్‌లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌లు విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, క్రిస్‌ గేల్‌ లాంటి సూపర్‌ స్టార్లు ప్రాతినిధ్యం వహించినా.. ఐపీఎల్‌లో ఇప్పటిదాకా ఆర్‌సీబీ టైటిల్‌ గెలవలేదు. 2009, 2011, 2016 సీజన్‌లలో ఫైనల్ చేరినా.. కప్పు మాత్రం అందని ద్రాక్ష లాగే ఉంది. అయితే ఆర్‌సీబీ ఐపీఎల్ టైటిల్‌ ఎందుకు గెలవలేదో ఆ జట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఇటీవలే వెల్లడించాడు.
Virat Kohli Opens Up On Why Royal Challengers Bangalore Has Not Win Title Yet

'శ్రేయాస్‌ అయ్యర్‌ లవ్‌లో పడ్డాడనుకున్నా.. సైకాలజిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్లా''శ్రేయాస్‌ అయ్యర్‌ లవ్‌లో పడ్డాడనుకున్నా.. సైకాలజిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్లా'

 ఎప్పుడూ భారీ అంచ‌నాలు:

ఎప్పుడూ భారీ అంచ‌నాలు:

ఇటీవలే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్‌ పీటర్సన్‌, విరాట్ కోహ్లీల మధ్య ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌చాట్‌ జరిగిన విషయం తెలిసిందే. ఆర్‌సీబీ ఐపీఎల్ టైటిల్ ఎందుకు గెలలేదు అని కోహ్లీని పీటర్సన్‌ ప్రశ్నించాడు. 'ఆర్‌సీబీ ప్ర‌తి ఏడాది స్టార్ ఆట‌గాళ్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉంటుంది. దీని వ‌ల్ల అభిమానుల్లో మాపై ఎప్పుడూ భారీ అంచ‌నాలు ఉంటాయి. ఈసారైనా గెలుస్తారంటూ అభిమానులు అనుకోవ‌డం వ‌ల్ల ప్ర‌తి మ్యాచ్‌లో ఒత్తిడి నెల‌కొంటుంది' అని కోహ్లీ తెలిపాడు.

అదృష్టం కలిసి రాలేదు:

అదృష్టం కలిసి రాలేదు:

'ఇటీవల కాలంలో నాపై అదనంగా ఒత్తిడి పెంచిన వాటిలో ఐపీఎల్‌ ఒకటి. టైటిల్ గెలవడానికి ఇదే సరైన సీజన్‌ అని ప్రతి ఏడాదీ అనుకుంటూ ఉంటాం. కానీ.. మా ఆశలు ఎంతకూ నెరవేరట్లేదు. ఆర్‌సీబీ తరఫున డివిలియర్స్‌, గేల్‌ గొప్పగా ఆడారు. జట్టులోని అందరూ శ్రమిస్తున్నారు. స్టార్లు అందుబాటులో ఉన్నా టైటిల్‌ గెలవలేకపోయాం. మూడుసార్లు ఫైనల్‌కు వెళ్లాం. కానీ.. అదృష్టం కలిసి రాలేదు. ఈ ఏడాదిని ట్రోఫీని గెలుచుకునే సీజన్‌గా భావించాం. కరోనా కారణంగా టోర్నీ జరగడంపైనే అనుమానులున్నాయి. ఆర్‌సీబీ కప్‌ గెలిచేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి' అని విరాట్‌ చెప్పాడు.

ఎప్ప‌టికి మ‌రిచిపోలేని ఇన్నింగ్స్‌:

ఎప్ప‌టికి మ‌రిచిపోలేని ఇన్నింగ్స్‌:

'2016లో కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 50 బంతుల్లో 113 ప‌రుగులు చేయ‌డం నా ఐపీఎల్ కెరీర్‌లో ఎప్ప‌టికి మ‌రిచిపోలేని ఇన్నింగ్స్‌. పంజాబ్‌తో మ్యాచ్‌లో నేను అనుకున్న రీతిలో బ్యాటింగ్ చేయ‌డాన్ని ఆస్వాదించాను. ద‌క్షిణాఫ్రికాలో జ‌రిగిన 2009-10 సీజ‌న్‌లో నీతో (పీట‌ర్స‌న్‌)తో పాటు క‌లిస్‌, బౌచ‌ర్‌, అనిల్ భాయ్‌, రాబిన్‌తో క‌లిసి ఆర్‌సీబీకి ఆడ‌టం నాకు చిర‌కాలం గుర్తుంటుంది' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఐపీఎల్‌ను బీసీసీఐ ఈనెల 15 వ‌ర‌కు వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే.

Story first published: Tuesday, April 7, 2020, 10:29 [IST]
Other articles published on Apr 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X