న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెయ్యి పరుగులు: వివ్ రిచర్డ్స్ రికార్డుని కోహ్లీ బద్దలు కొడతాడా?

Virat Kohli On Brink Of A Feat That Only Viv Richards Has Achieved

హైదరాబాద్: భారత పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ మరో రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతకీ ఆ రికార్డు ఏమంటే.. విదేశీ గడ్డపై ఓ సిరీస్‌లో ఓ ఆటగాడు వెయ్యికి పైగా పరుగులు సాధించడం. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో వెస్టిండీస్‌కు చెందిన వివ్‌ రిచర్డ్స్‌ మాత్రమే విదేశీ గడ్డపై వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. ఇప్పుడు కోహ్లీ ఆ రికార్డుకు చేరువయ్యాడు.

870 చేసేశాడు:

870 చేసేశాడు:

ప్రస్తుతం కోహ్లీ సేన దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన టెస్టు, వన్డే, టీ20ల్లో కలిపి కోహ్లీ చేసిన పరుగులు 870. వెయ్యి పరుగుల మైలు రాయిని అందుకోవడానికి కోహ్లీకి కావాల్సింది ఇంకా 130 పరుగులు.

ఇంగ్లాండ్ గడ్డపై మెరుపులు:

ఇంగ్లాండ్ గడ్డపై మెరుపులు:

1976లో వివ్‌ రిచర్డ్స్‌ ఇంగ్లాండ్‌ గడ్డపై 1,045(వన్డేల్లో 216, టెస్టుల్లో 829) పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఏ ఒక్క ఆటగాడు ద్వైపాక్షిక సిరీస్‌లో విదేశీ గడ్డపై వెయ్యికి పైగా పరుగులు సాధించిన దాఖలాలు లేవు.

కోహ్లీ ఏ మాత్రం తగ్గడు:

కోహ్లీ ఏ మాత్రం తగ్గడు:

1976లో బ్రాడ్‌మెన్‌ రికార్డును సరిచేస్తూ వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా రిచర్డ్స్ రికార్డులకెక్కాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న కోహ్లీ ఇప్పటి వరకు 870(టెస్టుల్లో 286, వన్డేల్లో 558, ఒక టీ20లో 26) పరుగులు సాధించాడు. మరి రిచర్డ్స్‌ రికార్డును కోహ్లీ తిరగరాస్తాడో? లేదో? తెలియాలంటే 24వరకు వేచి ఉండాల్సిందే.

ఇదే మొదటి సారి:

ఇదే మొదటి సారి:

పర్యటనలో భాగంగా కోహ్లీ సఫారీ గడ్డపై ఇంకా రెండు టీ20 మాత్రమే ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల్లో అతడు 130కి పైగా పరుగులు చేస్తే ద్వైపాక్షిక సిరీస్‌లో విదేశీ గడ్డపై వెయ్యి పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 బుధవారం(21న), మూడోది శనివారం(24న) జరగనున్నాయి.

Story first published: Wednesday, February 21, 2018, 12:46 [IST]
Other articles published on Feb 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X