ఆ బామ్మ భ‌లే ఛాన్స్ కొట్టేసిందే!

ICC Cricket World Cup 2019 : Kohli Arranges World Cup Tickets For 87-year-old Fan Charulata Patel

లండ‌న్‌: ప్రపంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా బ‌ర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్ట‌న్ స్టేడియంలో భార‌త క్రికెట్ జ‌ట్టు, బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో సెంట‌ర్ ఆఫ్ ద అట్రాక్ష‌న్‌గా నిలిచిన 87 సంవ‌త్స‌రాల చారుల‌త ప‌టేల్‌.. భ‌లే చాన్స్ కొట్టేశారు. భార‌త్, శ్రీలంక శ‌నివారం ఆరంభం కాబోయే చివ‌రి లీగ్ మ్యాచ్ స‌హా, రెండు సెమీఫైన‌ల్స్‌, ఫైన‌ల్ మ్యాచ్ టికెట్ల‌ను ఆవిడ చేజిక్కించుకున్నారు. టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ ఈ నాలుగు మ్యాచ్‌ల టికెట్లు స‌కాలంలో ఆమెకు అందేలా చేశాడు. ఈ విష‌యాన్ని చారులత ప‌టేల్ మ‌న‌వ‌రాలు అంజ‌లీ ప‌టేల్ ధృవీక‌రించారు.

టీమిండియాకే కాదు..బీసీసీఐ ఖాతాలోనూ ఓ ల్యాండ్‌మార్క్‌!

శ‌నివారం లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియంలో భార‌త క్రికెట్ జ‌ట్టు శ్రీలంక‌ను ఢీ కొట్ట‌బోతోంది. టీమిండియా ఆడ‌బోయే చివ‌రి లీగ్ మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్‌తో పాటు రెండు 9, 11 తేదీల్లో జ‌రిగే రెండు సెమీఫైన‌ల్స్‌, 14వ తేదీన జ‌ర‌గ‌బోయే ఫైన‌ల్ మ్యాచ్ టికెట్ల‌ను అంద‌జేయ‌నున్న‌ట్లు స్టేడియం నిర్వాహ‌కుల నుంచి స‌మాచారం అందింద‌ని అంజలి పటేల్ తెలిపారు. ఈ నాలుగు మ్యాచ్‌ల టికెట్ల‌ను తాను ఉచితంగా పంపిస్తాన‌ని అంటూ కేప్టెన్ విరాట్ కోహ్లీ, వైఎస్ కేప్టెన్ రోహిత్ శ‌ర్మ ఇటీవ‌లే చారుల‌త ప‌టేల్‌కు మాట ఇచ్చారు. దీన్ని బ‌ట్టి చూస్తే- ఆ పెద్దావిడ ఇక ఈ నాలుగు మ్యాచుల్లోనూ క‌నిపించ‌బోతున్నారు.

ఎడ్జ్‌బాస్ట‌న్ స్టేడియంలో మ్యాచ్ అనంత‌రం విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ ఆ పెద్దావిడ‌ను క‌లుసుకుని ఆశీర్వాదాన్ని తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా అన్ని మ్యాచ్‌ల‌కూ హాజ‌రు కావాల‌ని విరాట్ కోహ్లీ ఆమెను కోరారు. త‌మ వ‌ద్ద టికెట్లు లేవ‌ని చారుల‌త తెలియ‌జేయ‌గా.. తాను వాటిని ఏర్పాటు చేస్తాన‌ని మాట ఇచ్చాడు కోహ్లీ. దీని ప్ర‌కార‌మే భార‌త్‌-శ్రీలంక మ్యాచ్‌తో పాటు రెండు సెమీఫైన‌ల్స్‌, ఫైన‌ల్ మ్యాచ్ టికెట్ల‌ను త‌మ కోసం పంపించాడ‌ని అంజ‌లీ ప‌టేల్ వెల్ల‌డించారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, July 4, 2019, 16:42 [IST]
Other articles published on Jul 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X