న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అగ్ర అథ్లెట్లలో కోహ్లీ ఒకడు.. ఫిట్‌నెస్‌ విషయంలో మా ఆటగాళ్లు ఏమాత్రం..: పాక్ కోచ్

Virat Kohli is one of top athletes, our boys are not behind on fitness says Waqar Younis

ఇస్లామాబాద్: అగ్ర అథ్లెట్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడని, ఫిట్‌నెస్‌ విషయంలో భారత సారథి కంటే తమ జట్టు ఆటగాళ్లు ఏమాత్రం వెనుకబడి లేరని పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ అన్నారు. కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా పేరు పొందాడు. కోహ్లీ ఫిట్‌నెస్‌ పరిశీలిస్తే ఆటపై అతను ఎంత అంకితబావం చూపుతాడో అర్థమవుతుంది. జట్టు సభ్యులంతా రెండు గంటలు కసరత్తులు చేస్తే.. కోహ్లీ నాలుగు గంటల వరకు చేస్తాడు. ఎక్కువ సేపు జిమ్‌లో గడుపుతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అతడిని చూసి మిగతా క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై దృష్టిసారించిన సంగతి తెలిసిందే.

అగ్ర అథ్లెట్లలో కోహ్లీ ఒకడు

అగ్ర అథ్లెట్లలో కోహ్లీ ఒకడు

విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌ మంత్రాన్ని మొత్తం భారత జట్టు, ఇతర జట్లు కూడా స్వీకరించాయి. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ నుంచి మాజీ ఫిజియో ప్యాట్రిక్ ఫర్హార్ట్ వరకు అందరూ ఫిట్‌నెస్‌పై భారత కెప్టెన్‌ను ప్రశంసించిన వారే. ఫిట్‌నెస్‌ పట్ల అంకితభావంతో కోహ్లీ తన ఆటతీరునే మార్చుకున్నాడన్నారు వకార్ యూనిస్. ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌లో గ్లోఫాన్స్ఆఫీషియల్‌లో అభిమానులతో వకార్ మాట్లాడుతూ... 'కోహ్లీ ఆటను అభివృద్ధి చేశాడు. వన్డే, టీ20 క్రికెట్‌తో సహా అన్ని ఫార్మాట్లలో అతను అద్భుతంగా రాణిస్తాడు. టెస్ట్ మ్యాచ్‌లలో అద్భుతంగా ఆడతాడు. క్రికెట్‌కు కోహ్లీ తీసుకొచ్చిన అతి పెద్ద వ్యత్యాసం అతని ఫిట్‌నెస్' అని తెలిపారు.

ఫిట్‌నెస్‌ బార్‌ను ఏర్పాటు చేశాడు

ఫిట్‌నెస్‌ బార్‌ను ఏర్పాటు చేశాడు

'విరాట్‌ కోహ్లీ ప్రపంచ వ్యాప్తంగా ఫిట్‌నెస్‌ బార్‌ను ఏర్పాటు చేశాడు. విరాట్ విషయంలో ప్రతి ఒక్కరికి అతనిలో అన్ని లక్షణాలు నచ్చుతాయి. అతను ఎంతో ఆరోగ్యంగా ఉంటాడు. ఎల్లప్పుడూ ఉత్తమమని నిరుపించుకోవడానికి తాపత్రయ పడుతుంటాడు. కోహ్లీ ఒక పోరాట యోధుడు. అందుకే మనమందరం అతడిని ఇష్ట పడతాం' అని వకార్‌ అన్నారు. అంతర్జాతీయ కెరీర్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 86 టెస్టుల్లో, 248 వన్డేల్లో, 82 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి ఇప్పటికే 70 శతకాలు బాదాడు.

మా ఆటగాళ్లు ఫిట్‌గా ఉన్నారు

మా ఆటగాళ్లు ఫిట్‌గా ఉన్నారు

పాకిస్తాన్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌కు సరితూగగలరా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు వకార్‌ యూనిస్‌ ఇలా సమాధానమిచ్చాడు. 'చాలా మంది క్రికెటర్లు ఫిట్‌గా ఉన్నారనడంలో సందేహం లేదు. ఉత్తమ ఫిట్‌నెస్‌ ప్రమాణాలతో మూడు ఫార్మాట్లలోనూ రాణించగలుగుతారు. విరాట్‌ కోహ్లీ దేశంలోని అథ్లెట్లలో ఒకడు. మా కురాళ్లు కూడా ఫిట్‌నెస్‌ విషయంలో మెరుగ్గానే ఉన్నారు. భారత సారథి కంటే మా జట్టు ఆటగాళ్లు ఏమాత్రం వెనుకబడి లేరు. బాబర్ ఆజమ్‌ను తీసుకుంటే అతను చాలా ఫిట్‌గా ఉన్నాడు. షాహీన్ షా అఫ్రిది సూపర్ ఫిట్. మేము మా సొంత బార్‌ను సెట్ చేస్తాం. మేము వేరొకరిని కాపీ చేయము. పాకిస్తాన్ క్రికెట్‌కు సరిపోయే బార్‌ను మేము సెట్ చేస్తాం. జట్టును ముందుకు తీసుకువెళ్తాం' అని వకార్‌ పేర్కొన్నారు.

ఆగస్టు 5 నుంచి ప్రారంభం

ఆగస్టు 5 నుంచి ప్రారంభం

పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉంది. మాంచెస్టర్‌లో ఆగస్టు 5 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టుతో ఇంగ్లండ్‌తో పాకిస్తాన్ 3 టెస్టులు, 3 టీ20లను ఆడనుంది. బయో బబుల్ వాతావరణంలో ప్రస్తుతం వెస్టిండీస్‌తో ఇంగ్లండ్‌ టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఆపై పాకిస్తాన్‌తో పరిమిత ఓవర్ల సిరీసులు ఆడనుంది. పాక్ ఆటగాళ్లు ఇప్పటికే క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ మొదలెట్టింది.

'వన్డేల్లో రోహిత్ చాంపియన్ కావొచ్చు.. ఆ విషయంలో మాత్రం సెహ్వాగ్‌ కంటే వెనుకంజలోనే'

Story first published: Tuesday, July 28, 2020, 16:16 [IST]
Other articles published on Jul 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X