న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత జట్టును చూస్తే గర్వంగా ఉంది: సెహ్వాగ్ (ట్వీట్లు)

Virat Kohli Is 'Greatest Ever ODI Player', Says Former England Captain

హైదరాబాద్: సెంచూరియన్ వేదికగా జరిగిన ఆరో వన్డేతో వన్డే సిరీస్ ముగిసింది. ఆఖరి మ్యాచ్‌లో సత్తా చాటిన కోహ్లీ సేనపై ట్విట్టర్ వేదికగా ప్రశంసల జల్లు కురస్తోంది. విదేశీ ఆటగాళ్లు సైతం కోహ్లీ ఆటతీరును కొనియాడుతున్నారు.

టెస్టుల్లో సఫారీల విజయాలను మైమరపించేలా వన్డేల్లో నెగ్గిన తీరు అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ విజయాల్లో విరాట్‌ కోహ్లీ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. శుక్రవారం సెంచూరియన్‌లో జరిగిన చివరి వన్డేలో శతకం సాధించిన కోహ్లీ ఎన్నో రికార్డులు బద్దలుకొట్టాడు. సఫారీ గడ్డపై తొలి సిరీస్‌ విజయాన్ని 5-1 తేడాతో గెలిచిన భారత జట్టుకు, అందుకు కారణమైన విరాట్‌ కోహ్లీపై అభిమానులు, మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సామాజిక మాధ్యమాల ద్వారా అభినందనలు తెలిపారు.

* 'కోహ్లీ ఇన్నింగ్స్‌ ఎప్పటికీ మరిచిపోలేనిది. సఫారీ గడ్డపై తొలి సిరీస్‌ విజయాన్ని నమోదు చేసిన భారత జట్టుకు అభినందనలు. గ్రేట్‌ అచీవ్‌మెంట్‌': సచిన్‌ టెండూల్కర్

* 'విదేశీ గడ్డపై సాధించిన గొప్ప సిరీస్‌ విజయాల్లో ఇది ఒకటి': రోహిత్‌ శర్మ

* 'క్రమశిక్షణతో 5-1తేడాతో సిరీస్‌ గెలిచిన భారత జట్టును చూస్తే ఎంతో గర్వంగా ఉంది. స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు': వీరేంద్ర సెహ్వాగ్

* 'కోహ్లీ డే.. జాలీ డే. కోహ్లీ ఎంతో సులువుగా 35వ శతకం సాధించాడు': రవిచంద్రన్‌ అశ్విన్‌

* 'ఈ మధ్య కాలంలో నేను చూసిన గొప్ప ఇన్నింగ్స్‌ల్లో ఇది ఒకటి. కంగ్రాట్స్‌ కోహ్లీ. సఫారీ గడ్డపై వన్డే సిరీస్‌లో టీమిండియా గెలవడంలో కీలకపాత్ర పోషించావు. ఇదే జోరు కొనసాగించండి': సురేశ్‌ రైనా

* '5-1తో సిరీస్‌ దక్కించుకున్న భారత జట్టుకు అభినందనలు. ఈ సిరీస్‌లో విరాట్‌ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. చాహల్‌, కుల్‌దీప్‌ కలిసి 33 వికెట్లు దక్కించుకున్నారు': వీవీఎస్‌ లక్ష్మణ్‌

* 'కోహ్లీ.. ఎప్పటికీ గొప్ప వన్డే ఆటగాడు. ఇది నిజం': మిచెల్‌ వాన్‌

* 'ఇది విరాట్‌ కోహ్లీ సిరీస్‌. ఒక బ్యాట్స్‌మెన్‌ ప్రత్యర్థిపై ఇంత ఆధిపత్యాన్ని ప్రదర్శించడం ఇంత వరకు చూడలేదు. కింగ్‌ కోహ్లీ': మహమ్మద్‌ కైఫ్‌

* 'సిరీస్‌లో బ్యాట్‌తో ఎంతో నాణ్యమైన, అత్యుత్తమమైన ప్రదర్శన చేశావు': మురళీ విజయ్‌

Story first published: Saturday, February 17, 2018, 13:08 [IST]
Other articles published on Feb 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X