ప్రతిభావంతుడు: విరాట్ కోహ్లీని క్రిస్టియానో రొనాల్డోతో పోల్చిన బ్రావో

Posted By:
Virat Kohli is Cristiano Ronaldo of cricket, says Dwayne Bravo

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీని పోర్చుగీసు ఫుట్‌బాల్‌ లెజండ్‌ క్రిస్టియానో రొనాల్డోతో బ్రావో పోల్చాడు.

కోహ్లీతో కలిసి ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బ్రావో

కోహ్లీతో కలిసి ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బ్రావో

ఐపీఎల్‌ 11వ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రావో.. న్యూ ఎరా టోపీల కలెక్షన్ కొత్త షోరూం ప్రారంభం కార్యక్రమంలో సోమవారం విరాట్‌ కోహ్లీతో కలిసి బ్రావో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 'కోహ్లీ ప్రతిభావంతుడు. ఆట పట్ల అతడికున్న అంకితభావం అమోఘం. ఒక ఆటగాడిగా నేను అతని ఆటను ఆస్వాదిస్తాను. కోహ్లీకి ప్రత్యర్థిగా ఆడటాన్ని నేను ఇష్టపడతా' అని అన్నాడు.

ఆట పట్ల కోహ్లీకి ఉన్న అంకిత భావం అమోఘం

ఆట పట్ల కోహ్లీకి ఉన్న అంకిత భావం అమోఘం

'అతను ఎప్పుడు మ్యాచ్ ఆడుతున్నా.. చూస్తాను. అది ఐపీఎల్‌లోనైనా.. భారత్ తరఫునైనా.. ఎందుకంటే అతనిలో బ్యాటింగ్ నైపుణ్యానికి నేను ముగ్ధుడ్ని. ఆట పట్ల కోహ్లీకి ఉన్న అంకిత భావం చూస్తుంటే.. అతను ఇప్పటి వరకు సాధించిన విజయాలకి అర్హుడనిపిస్తుంది. క్రికెట్‌లో క్రిస్టియానో రొనాల్డ్‌‌ని విరాట్ కోహ్లీ రూపంలో చూశాను' అని బ్రావో పేర్కొన్నాడు.

కోహ్లీతో కలిసి నా సోదరుడు డారెన్ ఆడాడు

కోహ్లీతో కలిసి నా సోదరుడు డారెన్ ఆడాడు

'నేను ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడుతున్నాను కాబట్టి.. ఈ మాట చెప్పడం లేదు. అండర్-19 సమయంలో విరాట్ కోహ్లీతో కలిసి నా సోదరుడు డారెన్ ఆడాడు. అప్పటి నుంచి మా తమ్ముడికి చెప్తున్నా.. విరాట్ కోహ్లి చాలా ఎత్తుకి ఎదుగుతాడని.. నా సోదరుడికి కూడా కొన్ని బ్యాటింగ్ స్కిల్స్ నేర్పించమని కోహ్లీని అప్పట్లో అడిగాను' అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.

న్యూ ఎరా షోరూంలో మూడు గంటలపాటు

న్యూ ఎరా షోరూంలో మూడు గంటలపాటు

అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఇంగ్లాండ్‌లో జరిగిన చాంపియన్స్‌ట్రోఫీ ఫైనల్‌కు ముందు ఇంగ్లాండ్‌లోని న్యూ ఎరా షోరూంలో జరిగిన టోపీల డిజైన్, మెటీరియల్ సామాగ్రిని చూస్తూ మూడు గంటలు గడిపానని తెలిపాడు. ఐపీఎల్ 11వ సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు జట్టు ఒక విజయాన్ని మాత్రమే సాధించింది. మంగళవారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో రాత్రి 8 గంటలకి బెంగళూరు తలపడనుంది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, April 17, 2018, 12:25 [IST]
Other articles published on Apr 17, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి