న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ ‌కోహ్లీ ఓ మోడల్‌.. అతడు మరో సచిన్‌ టెండూల్కర్‌!!

Virat Kohli is a charmer, he is a bit like Sachin Tendulkar: Former umpire Ian Gould

లండన్: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చూసేందుకు ఓ మోడల్‌లా కనిపిస్తాడని, అతడి ఫిట్‌నెస్‌ అమోఘమని మాజీ అంపైర్‌ ఇయాన్‌ గౌల్డ్‌ తెలిపారు. కోహ్లీ కొన్నిసార్లు తనలా బ్యాటింగ్‌ చేశాడని, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌లా అనిపించే క్రికెటర్లలో అతనొకడని గౌల్డ్‌ పేర్కొన్నారు. ఆయన తాజాగా ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ భారత సారథి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

దేశం మొత్తం కోహ్లీ వెంట:

దేశం మొత్తం కోహ్లీ వెంట:

'విరాట్ కోహ్లీ ఫన్నీ ఆటగాడు. కొన్నిసార్లు నాలా కూడా బ్యాటింగ్‌ చేశాడు. దాన్ని అలాగే కొనసాగించమని చెప్పి ఉండాల్సింది. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌లా అనిపించే క్రికెటర్లలో అతనొకడు. భారత దేశం మొత్తం కోహ్లీ వెంట ఉంది, అది మీకు తెలియదు. అతనికి అద్భుత ప్రతిభ ఉంది. నాణ్యమైన క్రికెట్ షాట్లు ఆడతాడు. లక్ష్య ఛేదనలో కోహ్లీ బ్యాటింగ్ బాగుంటుంది. ఎప్పుడూ జట్టు గెలవాలనే కోరుకుంటాడు. అందుకోసమే కష్టపడతాడు' అని గౌల్డ్‌ తెలిపారు.

విరాట్‌ ఓ మోడల్‌:

విరాట్‌ ఓ మోడల్‌:

'విరాట్ కోహ్లీతో ఒక రెస్టారెంట్‌కెళ్లి గంటలకొద్దీ కూర్చొని మాట్లాడొచ్చు. అతనో మాటకారి. తనని చూస్తే పురుషుల మోడల్‌లా అనిపిస్తాడు. విరాట్‌కు క్రికెట్‌ గురించి బాగా తెలుసు. మైదానంలో కొన్నిసార్లు దూకుడుగా ఉండే అతను.. కొన్నేళ్లుగా చాలా గౌరవం సంపాదించుకున్నాడు. జట్టు విజయాల బాధ్యత అతనిపైనే ఉంది. కోహ్లీ మంచి వ్యక్తి. భారత ఆటగాళ్లు కూడా చాలా మంచోళ్లు. ఎంతో గౌరవం సంపాదించుకున్నారు' అని మాజీ అంపైర్‌ ప్రశంసించారు.

13 ఏళ్ల కెరీర్‌లో 250 మ్యాచ్‌లకు అంపైర్‌గా సేవలు

13 ఏళ్ల కెరీర్‌లో 250 మ్యాచ్‌లకు అంపైర్‌గా సేవలు

ఇయాన్‌ గౌల్డ్‌ 13 ఏళ్ల కెరీర్‌లో 250కి పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైర్‌గా సేవలందించారు. గతేడాదే ఐసీసీ ప్యానెల్‌ ఆఫ్‌ ఎలైట్‌ అంపైర్స్‌ నుంచి రిటైరయ్యారు. కాగా గౌల్డ్‌ అంపైర్‌గా కొనసాగడానికి ముందు ఇంగ్లాండ్‌లో ఫస్ట్‌క్లాస్‌ ప్లేయర్‌గా కొనసాగాడు. ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల టాప్‌-100 జాబితాలో భారత్‌ నుంచి విరాట్‌ కోహ్లీకి మాత్రమే చోటు లభించింది. ఫోర్బ్స్‌ జాబితాలో రూ. 196 కోట్ల ఆదాయంతో భారత కెప్టెన్ 66వ స్థానంలో నిలిచాడు. గత ఏడాదితో పోలిస్తే.. విరాట్ 34 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. కోహ్లీకి ఎండార్స్‌మెంట్ల ద్వారా 2 కోట్ల 40 లక్షల డాలర్లు లభించగా.. 20 లక్షల డాలర్లు ప్రైజ్‌మనీ, వేతనం ద్వారా వచ్చాయి. టాప్‌-100లో నిలిచిన ఏకైక క్రికెటర్, భారత్‌ నుంచి ఏకైక క్రీడాకారుడు కోహ్లీనే కావడం విశేషం.

2008లో అంతర్జాతీయ ఆరంగేట్రం

2008లో అంతర్జాతీయ ఆరంగేట్రం

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 86 టెస్టులాడి 53.63 సగటుతో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 248 వన్డేల్లో 59.34 సగటుతో 11,867 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 58 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 81 టీ20లలో 50.8 సగటుతో 2,794 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 21,901 పరుగులు చేశాడు.

Story first published: Monday, June 1, 2020, 13:35 [IST]
Other articles published on Jun 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X