న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరీ.. ఇంత గందరగోళానికి గురి చేస్తాడనుకోలేదు: కోహ్లీ

మరీ.. ఇంత గందరగోళానికి గురి చేస్తాడనుకోలేదు: కోహ్లీ
Virat Kohli indicates Umesh Yadav will be in mix in Australia after standout performance

హైదరాబాద్: ఆతిథ్య భారత్‌తో పోరాడుతోన్న వెస్టిండీస్‌కు ఘోర పరాజయం తప్పలేదు. రెండు టెస్టుల్లోనూ ఒకే తరహాలో ప్రదర్శన చేయడంతో సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాతో సొంతం చేసుకుంది. రెండో టెస్టులో రెండు ఇన్నింగ్‌లలో కలిపి 10 వికెట్లు తీసిన ఉమేశ్‌ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచాడు. దీంతో ఉమేశ్‌పై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ప్రశంసలు కురిపిస్తున్నాడు.

రెండు టెస్టుల్లోనూ విజయవంతంగా

రెండు టెస్టుల్లోనూ విజయవంతంగా

అతడిది ఔట్‌ స్టాండింగ్‌ ప్రదర్శన అంటూ అభినందించాడు. ఇంగ్లాండ్ పర్యటన అనంతరం విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ కోహ్లీ ఆసియా కప్ టోర్నీకి హాజరుకాలేకపోయాడు. నూతనోత్తేజంతో బరిలోకి దిగిన కోహ్లీ.. ఈ రెండు టెస్టుల్లోనూ విజయవంతంగా నడిపించాడు. మ్యాచ్‌ అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.

 3 రోజుల్లో ముగుస్తుందని ఊహించలేదు:

3 రోజుల్లో ముగుస్తుందని ఊహించలేదు:

‘రెండో టెస్టు కూడా మూడు రోజుల్లో ముగుస్తుందని మేం ఊహించలేదు. ఎందుకంటే విండీస్‌ తొలి టెస్టు కంటే రెండో టెస్టులో కాస్త మెరుగ్గా ఆడింది. భారత్‌ను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేయడానికి బాగా ప్రయత్నం చేసింది. ప్రత్యర్థి జట్టు నుంచి మేం కూడా అదే స్థాయి పోటీని ఆశిస్తాం. సొంత గడ్డపై పరిస్థితులు మాకు అనుకూలించాయి. వాటిని ఉమేశ్‌ యాదవ్‌ బాగా ఉపయోగించుకున్నాడు. '

ధావన్‌కు కొత్త పేరు పెట్టిన హర్భజన్

ప్రత్యర్థిని ఆందోళనకు గురి చేసే లక్షణం

ప్రత్యర్థిని ఆందోళనకు గురి చేసే లక్షణం

'ప్రత్యర్థిని ఆందోళనకు గురి చేసే లక్షణం ఉందని తెలుసు కానీ మరీ ఇంత ఉందని ఊహించలేదు. 10 వికెట్లు తీసి ఔట్‌ స్టాండింగ్‌ ప్రదర్శన చేశాడు. శార్దూల్‌ గాయం బారిన పడటంతో కాస్త ఆయోమయంలో పడ్డ మాకు ఉమేశ్ రూపంలో ఊరట లభించింది. షమీ కూడా ఈ టెస్టులో లేడు. దీంతో బౌలర్ల బలం తక్కువగా ఉందని కాస్త ఆందోళన చెందాం. కానీ ఉమేశ్‌ ఉన్నానంటూ తన బాధ్యతను 100శాతానికి మించి నిర్వర్తించాడు' అంటూ కోహ్లీ ప్రశంసల్లో ముంచెత్తాడు.

రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగుల తేడాతో చిత్తు

రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగుల తేడాతో చిత్తు

తొలి రోజు విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ బాగానే పోరాడారు. రెండో రోజు ప్రత్యర్థి బౌలర్లూ సవాలు విసిరారు. మూడో రోజూ ఉదయమూ భారత్‌కు కాస్త ప్రతికూల వాతావరణం ఎదురైనా విజయాన్ని చేజిక్కుంచుకున్నారు. అనూహ్యంగా.. కరీబియన్‌ వీరులను రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగుల తేడాతో చిత్తు చేశారు. దీంతో భారత్‌ సొంతగడ్డపై వరుసగా పదో సిరీస్‌ విజయం సాధించింది.

Story first published: Monday, October 15, 2018, 13:09 [IST]
Other articles published on Oct 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X