న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ట్విట్టర్‌లో అభినందనలు: యువీ మ్యాచ్ విన్న‌ర్.. ఓ ఫైట‌ర్

Virat Kohli, Harbhajan Singh, Virender Sehwag, Mohammad Kaif, Pragnan Oja, Suresh Raina Among Others React After Yuvraj Singhs Retirement

భారత స్టార్ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ (37) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. బీసీసీఐతో చర్చలు జరిపిన అనంతరం సోమవారం ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించి యువరాజ్‌ సింగ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. 'వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయం అనిపించింది. దాదాపు 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. జీవితంలో ఏ విధంగా పోరాడాలో ఆటనే నేర్పింది' అని యువీ పేర్కొన్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన యువీకి.. త‌న తోటి ఆటగాళ్ల నుంచి ట్విట్టర్‌లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, మ‌హ్మ‌ద్ కైఫ్, వృద్ధిమాన్‌ సాహా, ప్రజ్ఞాన్‌ ఓజా, ఐసీసీ, ఈఎస్‌పీఎన్‌, స్టార్ స్పోర్ట్స్ యువీకి బెస్ట్ విషెస్ చెప్పాయి.

వీరేంద్ర సెహ్వాగ్‌

ఆటగాళ్లు వస్తారు, వెళతారు కానీ యువీ లాంటి ఆటగాళ్లు అరుదుగా ఉంటారు. అతడి భవిష్యత్‌ జీవితం సాఫీగా సాగిపోవాలి.

వీవీఎస్‌ లక్ష్మణ్‌

యువరాజ్‌ సింగ్‌తో కలిసి ఆడటం సంతోషాన్ని ఇచ్చింది. క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లలో ఒకడు. ఆట పట్ల అతడు చూపించే ప్రేమ, అంకితభావం, ఉత్సాహం తమకు ప్రేరణగా నిలిచింది.

మ‌హ్మ‌ద్ కైఫ్:

ఏన్నో విప‌త్క‌ర ప‌రిస్థితుల నుంచి యువీ విజేత‌గా నిలిచాడు. త‌న ఆత్మ స్థ‌యిర్యంతో ఎంతో మందికి ప్రేర‌ణ‌గా నిలిచాడు. యువీ మ్యాచ్ విన్న‌ర్.. ఓ ఫైట‌ర్. దేశానికి యువీ అందించిన సేవ‌కు గ‌ర్వ‌ప‌డాలి.

వృద్ధిమాన్‌ సాహా:

క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. యువీ రిటైర్‌మెంట్‌ అభిమానులకు కచ్చితంగా నిరాశ కలిగిస్తుందని, అతడి జీవితం స్ఫూర్తిదాయకమని ప్రశంసించాడు.

ప్రజ్ఞాన్‌ ఓజా:

యువరాజ్‌ సింగ్‌ ప్రస్థానం అసామాన్యమైనది. అద్భుతమైన క్రీడాజీవితం సాగించాడు.

Story first published: Monday, June 10, 2019, 17:18 [IST]
Other articles published on Jun 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X