న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final: సిరాజ్ విషయంలో మాట తప్పిన కోహ్లీ.. తుది జట్టు ఎంపికపై మండిపడుతున్న ఫ్యాన్స్!

Virat Kohli Gets Trolled For Not Considering Mohammed Siraj In WTC Final Playing 11

సౌతాంప్టన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు వర్షం ఆటంకం కలిగిస్తోంది. సౌతాంప్టన్‌లో ప్రస్తుతం వర్షం భారీగా కురుస్తుండటంతో తొలి రోజు ఆట జరగడం అనుమానంగా మారింది. ఇప్పటికే తొలి సెషన్ ఆటను రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. దాంతో ఎంతగానో ఎదురు చూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే ఈ మెగా ఫైనల్ బరిలో దిగే భారత తుది జట్టును గురువారం రాత్రే ప్రకటించారు.

జట్టులో పెద్ద మార్పులు ఏమి లేకపోయినా.. హైదరాబాద్ గల్లీ భాయ్ మహమ్మద్ సిరాజ్‌కు మొండి చెయ్యే ఎదురైంది. అతనికి బదులు సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు టీమ్‌మేనేజ్‌మెంట్ అవకాశం ఇచ్చింది. సిరాజ్ మంచి ఫామ్‌లో ఉన్నా.. స్వింగ్ చేయగల సత్తా ఉన్నా.. టీమ్‌మేనేజ్‌మెంట్ ఇషాంత్ అనుభవానికి ఓటేసింది. అయితే సిరాజ్‌కు చోటివ్వకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మాట తప్పిన కోహ్లీ..

మంచి స్వింగ్ బౌలర్ అయిన సిరాజ్‌ను పక్కనపెట్టడం బాలేదని, పైగా అతను అద్భుత ఫామ్‌లో ఉన్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సిరాజ్‌ను తీసుకుంటానని చెప్పిన విరాట్ చివరకు మాట తప్పాడని మండిపడుతున్నారు. వాస్తవానికి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ముందు జరిగిన మీడియా సమావేశంలో టీమ్ ప్లాన్స్ గురించి విరాట్, శాస్త్రి మాట్లాడుకున్న మాటలు లీకయ్యాయి.

అప్పటికి లైవ్ ఇంకా స్టార్ట్ కాలేదని భావించిన కోహ్లీ.. న్యూజిలాండ్ లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌లను ఎలా కట్టడి చేయాలి..? అనే వ్యూహంపై రవిశాస్త్రితో చర్చించాడు. ఈ క్రమంలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లను రౌండ్ ద వికెట్ బౌలింగ్‌ చేయించడం ద్వారా కట్టడి చేయబోతున్నట్లు కోహ్లీ వెల్లడించగా.. రవిశాస్త్రి అందుకు అంగీకారం తెలిపాడు. ఈ మాటలు లైవ్‌లో వచ్చేశాయి.

స్వింగ్‌కు బదులు బౌన్స్‌కే..

దాంతో సిరాజ్ తుది జట్టులో ఉండటం ఖాయమని అంతా భావించారు. పైగా ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉండటంతో స్వింగ్ బౌలర్‌గా అతను కీలకం అవుతాడని చాలా మంది నిపుణులు అభిప్రాయపడ్డాడు. కానీ విరాట్ కోహ్లీ అండ్ కో.. పిచ్‌పై బౌన్స్ ఉంటుందన్న క్యూరెటర్ మాటలతో ఇషాంత్‌కు చాన్స్ ఇచ్చింది.

టాల్ బౌలర్ అయిన ఇషాంత్ బౌన్స్ చేయగలడని భావిస్తోంది. ఇక ఇషాంత్ కూడా ఇది తనకు ఇదే చివరి ప్రపంచకప్ అని, టీ20, వన్డే ప్రపంచకప్‌లు ఆడలేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం కూడా టీమ్‌మేనేజ్‌మెంట్ పరిశీలనలోకి తీసుకున్నట్లుంది. అంతేకాకుండా 2018 ఇంగ్లండ్ పర్యటనలో ఇషాంత్ 18 వికెట్లు తీశాడు.

సిరాజ్‌కు అండగా..

ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆడటం తన కల అని ఇటీవల మహ్మద్ సిరాజ్ కూడా చెప్పుకొచ్చాడు. కానీ అతనికి అవకాశం దక్కలేదు. ఈ ఏడాది ఆరంభంలో ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో అంచనాలకి మించి బౌలింగ్‌లో రాణించిన మహ్మద్ సిరాజ్.. భారత్ విజయంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు.

అయినప్పటికీ.. అతడ్ని పక్కన పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో నెటిజన్లు సిరాజ్‌కు అండగా నిలుస్తున్నారు. సిరాజ్‌కు మంచి భవిష్యత్తు ఉందని భరోసా ఇస్తున్నారు. మరికొందరు మాత్రం టీమ్ బాగుందని, మంచి బ్యాలెన్స్‌తో ఉందని కామెంట్ చేస్తున్నారు.

భారత తుది జట్టు ఇదే

భారత తుది జట్టు ఇదే

విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభమన్ గిల్, చతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ

Story first published: Friday, June 18, 2021, 15:22 [IST]
Other articles published on Jun 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X