న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ కీలక నిర్ణయం: ఆర్‌సీబీ బ్యాటింగ్ కోచ్‌గా గ్యారీ కిరిస్టన్

By Nageshwara Rao
 Virat Kohli: Gary Kirsten the ideal man to supervise Royal Challengers Bangalores batting

హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటింగ్ కోచ్‌గా గ్యారీ కిరిస్టన్ వ్యవహారించనున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచన మేరకే గ్యారీ కిరిస్టన్‌ను బ్యాటింగ్ కోచ్‌గా ప్రాంఛైజీ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్ | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

గత పదేళ్ల ఐపీఎల్ చరిత్రలో మూడుసార్లు ఫైనల్‌కి చేరినప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కనీసం ఒకసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేకపోయింది. ముఖ్యంగా గతేడాది ఆ జట్టు అత్యంత చెత్త ప్రదర్శనను నమోదు చేసింది. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది.

దీంతో ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోన్న ఆ జట్టు కోచింగ్ సిబ్బందిలో కొన్ని మార్పులు చేసింది. బెంగళూరు హెడ్ కోచ్‌గా డేనియల్ వెటోరీ కొనసాగుతుండగా.. బౌలింగ్‌ కోచ్‌గా ఆశిష్ నెహ్రా ఇప్పటికే జట్టులో చేరాడు. తాజాగా బ్యాటింగ్‌ కోచ్‌గా గ్యారీ కిరిస్టన్ జట్టుతో కలిశారు.

'ఐపీఎల్‌ 2018 ఆటగాళ్ల వేలానికి ముందే బ్యాటింగ్‌ కోచ్‌ గురించి జట్టులో చర్చించుకున్నాం. ఆ చర్చలో నేను గ్యారీ కిరిస్టన్‌కి మద్దతు తెలిపాను. బెంగళూరు జట్టులోని యువ క్రికెటర్లు గ్యారీ పర్యవేక్షణలో తమ ఆటని మెరుగుపర్చుకునేందుకు ఇదో గొప్ప అవకాశం. భారత జట్టుకి ఆడుతున్న తొలి రోజుల్లోనే గ్యారీ దగ్గర నేర్చుకునే అవకాశం నాకు దక్కింది' అని కోహ్లీ అన్నాడు.

'క్లిష్ల సమయాల్లో అతను నాకు అండగా నిలిచారు. జట్టులోని ఆటగాళ్లు సమష్టిగా ఆడేలా చేయడం గ్యారీ ప్రత్యేకత. 2011 ప్రపంచకప్ సమయంలో టీమిండియాని నడిపించిన తీరే దానికి నిదర్శనం' అని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. 2008లో కోహ్లీ నేతృత్వంలోని అండర్-19 జట్టు వరల్డ్‌కప్ గెలిచినప్పుడు కోచ్‌గా గ్యారీ ఉన్నాడు.

గ్యారీ కిరిస్టన్ భారత కోచ్‌గా ఉన్న సమయంలోనే ధోని నాయకత్వంలోని టీమిండియా 2011 వరల్డ్ కప్‌ని నెగ్గిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 11వ సీజన్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భాగంగా డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో చెన్నై జట్టు తలపడనుంది.

ఇక, బెంగళూరు విషయానికి వస్తే కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో (ఏప్రిల్ 8) ఆదివారం తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.

Story first published: Thursday, April 5, 2018, 15:28 [IST]
Other articles published on Apr 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X