న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మళ్లీ కోహ్లీనే టాప్ స్కోరర్.. కానీ పాంటింగ్‌ రికార్డుని అధిగమించలేకపోయాడు

Virat Kohli ends 2018 with 2735 runs, slots behind Ricky Ponting for most international runs in calendar year

హైదరాబాద్: ఈ ఏడాది అసాంతం అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మెల్ బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయి అభిమానులను నిరాశ పరిచాడు. ఆటలో భాగంగా మూడో రోజైన శుక్రవారం ఆసీస్ పేసర్ కమ్మిన్స్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు.

కెప్టెన్‌గా కోహ్లీ: హర్షా భోగ్లే వన్డే జట్టులో ధోనికి దక్కని చోటుకెప్టెన్‌గా కోహ్లీ: హర్షా భోగ్లే వన్డే జట్టులో ధోనికి దక్కని చోటు

ఇదిలా ఉంటే, ఈ ఏడాది భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డులకెక్కాడు. గత రెండేళ్లు వరుసగా విరాట్ కోహ్లీనే భారత్ తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గత ఏడాది 2818 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ 2016లో 2595 పరుగులు చేశాడు.

మూడు ఫార్మాట్లలో 2735 పరుగులు చేసిన కోహ్లీ

మూడు ఫార్మాట్లలో 2735 పరుగులు చేసిన కోహ్లీ

ఈ ఏడాది మూడు ఫార్మాట్లూ కలుపుకొని కోహ్లీ 2735 పరుగులు చేశాడు. అయితే, మూడు ఫార్మాట్లలో ఒక కేలండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ రికార్డుని మాత్రం అధిగమించలేకపోయాడు. 2005లో రికీ పాంటింగ్ మూడు ఫార్మాట్లలో 2833 పరుగులు చేశాడు.

విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా

విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా

ఈ ఏడాది దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ పర్యటనలలో సత్తా చాటిన కోహ్లీ ఒక కేలండర్ ఇయర్‌లో విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. గత మూడేళ్లలో కోహ్లీ 8148 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు ఉండటం విశేషం.

కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న దగ్గర నుంచి కోహ్లీ దూకుడు

కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న దగ్గర నుంచి కోహ్లీ దూకుడు

కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో దూసుకుపోతున్నాడు. వాస్తవానికి ఈ ఏడాది మరిన్ని పరుగులు విరాట్ కోహ్లీ ఖాతాలో చేరేవే. విశ్రాంతి, వెన్నునొప్పి కారణంగా కోహ్లీ 13 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. శ్రీలంక వేదికగా జరిగిన నిదాహాస్ ట్రోఫీకి విశ్రాంతి తీసుకున్న అప్ఘాన్‌తో జరిగిన ఏకైక టెస్టుకు కూడా దూరమయ్యాడు.

 పాంటింగ్ రికార్డను అందుకోలేకపోయిన కోహ్లీ

పాంటింగ్ రికార్డను అందుకోలేకపోయిన కోహ్లీ

ఆ తర్వాత ఆసియా కప్‌కు కూడా కోహ్లీ దూరం కావడంతో.. అతడి స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. ఆసియా కప్‌లో భారత జట్టుని టైటిల్ విజేతగా నిలబెట్టాడు. అదే, ఈ అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆడి ఉంటే.. విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ రికార్డుని అధిగమించేవాడే.

పరుగులు ఆటగాడు సంవత్సరం
2833 రికీ పాంటింగ్ 2005
2818 విరాట్ కోహ్లీ 2017
2813 కుమార సంగక్కర 2014
2735 విరాట్ కోహ్లీ 2018
2692 కేన్ విలియమ్సన్ 2015
Story first published: Friday, December 28, 2018, 17:32 [IST]
Other articles published on Dec 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X