న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాంచీ వేదికగా మూడో టెస్టు: స్మిత్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ?

IND vs SA 2019,3rd Test : Virat Kohli Needs Two Points To Topple Steve Smith ! || Oneindia Telugu
Virat Kohli could topple Steve Smith as No.1 batsman in 3rd Test against South Africa

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంపై కన్నేశాడు. కేవలం ఒకే ఒక్క పాయింట్ దూరంలో ఉన్న విరాట్ కోహ్లీ రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడో టెస్టులో ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంతో కొనసాగుతున్న ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ను అధిగమించే అవకాశం ఉంది.

ఇటీవలే పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో విరాట్ కోహ్లీ ‌(254 నాటౌట్) ప్రస్తుతం 936 పాయింట్లతో టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచాడు. అగ్రస్థానానికి కేవలం ఒక పాయింట్ దూరంలో ఉన్నాడు. బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత యాషెస్ టెస్టు సిరిస్‌తో పునరాగమనం చేసిన స్టీవ్ స్మిత్ చెలరేగి ఆడాడు.

భారత బౌలింగ్ దళం అద్భుతం.. ఒకప్పటి వెస్టిండీస్ బృందాన్ని తలపిస్తోంది!!

స్మిత్ ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం

స్మిత్ ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం

స్టీవ్ స్మిత్ ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన సమయంలో టెస్టుల్లో విరాట్ కోహ్లీ No.1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. యాషెస్ సిరిస్‌తో స్టీవ్ స్మిత్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి పునరాగమనం చేయడంతో పాటు అద్భుత ప్రదర్శన చేశాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో 110.57 యావరేజితో 774 పరుగులు చేసి తిరిగి టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.

కోహ్లీ ఒక్క సెంచరీ కూడా

కోహ్లీ ఒక్క సెంచరీ కూడా

మరోవైపు జనవరి 2018 నుంచి కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేయకపోవడంతో టెస్టుల్లో యావరేజి తగ్గింది. దీంతో యాషెస్‌ సిరీస్‌లో స్టీవ్ స్మిత్ చెలరేగడంతో 937 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. అయితే, నవంబర్ 21 వరకు ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌లు ఆడదు. ఈ నేపథ్యంలో రాంచీ టెస్టులో కోహ్లీ మరోసారి రాణిస్తే స్టీవ్‌స్మిత్‌ను అధిగమించే అవకాశం ఉంది.

పూణెలో డబుల్ సెంచరీ

పూణెలో డబుల్ సెంచరీ

పూణె వేదికగా దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీ చేసిన డబుల్ సెంచరీ టెస్టుల్లో ఏడోది కావడం విశేషం. ఈ క్రమంలో ఏడుసార్లు ఈ ఘనత సాధించిన ఇంగ్లాండ్‌ క్రికెట్ దిగ్గజం వాలీ హామ్మండ్‌, శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేలా జయవర్ధనేల సరసన విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ ఏడాది టెస్టుల్లో తొలి సెంచరీని సాధించడానికి కోహ్లీకి 9 ఇన్నింగ్స్‌ల సమయం పట్టింది.

బ్రాడ్‌మన్ రికార్డు సైతం

బ్రాడ్‌మన్ రికార్డు సైతం

అంతకముందు 8 ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లీ రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్ మన్(52 టెస్టుల్లో 6996 పరుగులు) రికార్డుని సైతం విరాట్ కోహ్లీ అధిగమించాడు. పూణె టెస్టులో టీమిండియా విజయం సాధించడంతో స్వదేశంలో వరుసగా 11 టెస్టు సిరిస్‌లను నెగ్గిన ఏకైక జట్టుగా కోహ్లీసేన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

రాంచీ వేదికగా మూడో టెస్టు

రాంచీ వేదికగా మూడో టెస్టు

భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టెస్టు శనివారం రాంచీ వేదికగా ప్రారంభం కానుంది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో మరో టెస్టు మిలిలుండగానే సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. విశాఖ వేదికగా జరిగిన తొలి టెస్టులో 203 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా... పూణె వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Story first published: Friday, October 18, 2019, 14:34 [IST]
Other articles published on Oct 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X