For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత బౌలింగ్ దళం అద్భుతం.. ఒకప్పటి వెస్టిండీస్ బృందాన్ని తలపిస్తోంది!!

Brian Lara says India pace battery is reminiscent of famed West Indies bowling attacks

ముంబై: ప్రస్తుత భారత బౌలింగ్ దళం అద్భుతంగా ఉంది. ఒకప్పటి వెస్టిండీస్ బృందాన్ని తలపిస్తోంది అని విండీస్ దిగ్గజం బ్రియాన్‌ లారా పేర్కొన్నారు. రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ టి20 లీగ్‌ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 16 వరకు ముంబై, పుణే వేదికగా జరుగుతుంది. ఈ టోర్నీ వివరాలను గురువారం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సచిన్‌ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్‌ లారా, తిలక రత్నే దిల్షాన్, బ్రెట్‌ లీ, జాంటీ రోడ్స్‌ పాల్గొన్నారు.

ఒకప్పటి వెస్టిండీస్ బృందాన్ని తలపిస్తోంది:

ఒకప్పటి వెస్టిండీస్ బృందాన్ని తలపిస్తోంది:

ఈ సందర్భంగా టీమిండియా పేస్‌ బౌలింగ్‌ దళంపై లారా ప్రశంసల వర్షం కురిపించాడు. 1980, 90ల్లో విండీస్‌ బౌలర్లను గుర్తుకుతెస్తోందని వెల్లడించారు. లారా మాట్లాడుతూ... 'ప్రస్తుత భారత బౌలింగ్ దళం అద్భుతం. ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో వారి ప్రదర్శన చూసా. భారత పేస్‌ బౌలింగ్‌ దాడి నమ్మశక్యంగా ఉంది. బుమ్రా, షమీ, ఇషాంత్, ఉమేశ్, భువనేశ్వర్‌తో కూడిన భారత్ బౌలింగ్ అమోగం. ఒకప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరీబియన్ బౌలర్లకు ప్రస్తుత భారత బౌలర్లు ఏమాత్రం తీసిపోరు. ఒకప్పటి వెస్టిండీస్ బృందాన్ని తలపిస్తోంది' అని అన్నారు.

కోహ్లీ అత్యుత్తమ కెప్టెన్:

కోహ్లీ అత్యుత్తమ కెప్టెన్:

'ఒక జట్టు సామర్థ్యాన్ని కొలిచేందుకు రిజర్వు బెంచ్‌ బలమే కీలకం. అప్పుడే బౌలింగ్‌, బ్యాటింగ్ దాడి బాగున్నట్టు. విరాట్ కోహ్లీ అత్యుత్తమ కెప్టెన్. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నుంచి ఎంతో నేర్చుకున్నాడు. కోహ్లీ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ప్రస్తుతం భారత క్రికెట్‌ సరైన దిశలో పయనిస్తోంది. అత్యుత్తమ వ్యక్తులు భారత క్రికెట్‌పై ప్రభావం చూపిస్తున్నారు. మూడు ఫార్మాట్లలోనూ రోహిత్‌ మంచి ఆటగాడు. టెస్టు క్రికెట్లోనూ తప్పక రాణిస్తాడు. అలాంటి ఆటగాడు రిజర్వు బెంచీపై ఉండటం కష్టం' అని లారా పేర్కొన్నారు.

 టెస్టు ఛాంపియన్‌షిప్‌ ముందే వచ్చుంటే బాగుండేది:

టెస్టు ఛాంపియన్‌షిప్‌ ముందే వచ్చుంటే బాగుండేది:

'టెస్టు ఛాంపియన్‌షిప్‌ ముందే వచ్చుంటే బాగుండేది. పసికూనలైన అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ ఆటకు కూడా పెద్ద జట్లు ఇప్పుడు ప్రాధాన్యం ఇస్తాయి. ఇది క్రికెట్‌కు ఎంతో మేలు చేస్తోంది. భారత్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. కీరన్‌ పొలార్డ్‌ విండీస్ టీ20 సారథిగా ఎంపికవ్వడం సంతోషకరం. విండీస్ మళ్లీ పుంజుకుంటుంది' అని లారా చెప్పుకొచ్చారు.

భారత్‌కు సచిన్‌ నాయకత్వం:

భారత్‌కు సచిన్‌ నాయకత్వం:

రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ టి20 లీగ్‌లో ఇండియా లెజెండ్స్, ఆ్రస్టేలియా లెజెండ్స్, దక్షణాఫ్రికా లెజెండ్స్, శ్రీలంక లెజెండ్స్, వెస్టిండీస్‌ లెజెండ్స్‌ జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. దాదాపు 75 మంది రిటైర్డ్‌ క్రికెటర్లు ఇందులో ఆడనున్నట్లు సమాచారం. ఈ లీగ్‌లో 10 మ్యాచ్‌లు జరుగుతాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌ ఆడుతాయి. భారత్‌కు సచిన్‌ టెండూల్కర్‌ నాయకత్వం వహిస్తుండగా.. జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, జహీర్‌ ఖాన్‌లు ఆడనున్నారు.

Story first published: Friday, October 18, 2019, 11:25 [IST]
Other articles published on Oct 18, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+