న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఆ ఒక్క రికార్డు తప్ప... మిగతా అన్ని రికార్డులను కోహ్లీ బద్దలు కొడతాడు'

Virat Kohli Will Break All Records Except One
 Virat Kohli can break all batting records besides Bradman’s average: Steve Waugh

హైదరాబాద్: సెంచరీలు సాధించడం... రికార్డులు బద్దలు కొట్టడం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ మధ్య కాలంలో సర్వ సాధారణం అయిపోయిందని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ వా వ్యాఖ్యానించాడు. అంతేకాదు ఛాంపియన్ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మన్‌ సాధించిన యావరేజి 99.94ను తప్ప కోహ్లీ క్రికెట్‌లో ఉన్న అన్ని రికార్డులను బద్దలుకొడతాడని స్టీవ్‌ వా అభిప్రాయపడ్డాడు.

30వ పడిలోకి కోహ్లీ: టాప్-5 టెస్ట్ సెంచరీలు మీకోసం ప్రత్యేకం30వ పడిలోకి కోహ్లీ: టాప్-5 టెస్ట్ సెంచరీలు మీకోసం ప్రత్యేకం

"క్రికెట్‌పై అతడు (విరాట్ కోహ్లీ)కి ఉన్న ఆసక్తి, ఫిట్‌నెస్‌, ఫామ్‌, పరుగులు చేయాలన్న తపనను లెక్కలోకి తీసుకుంటే అన్ని రికార్డులను తన పేరిట లిఖించుకునేలా కనిపిస్తున్నాడు. ఒకవేళ అతడు తీవ్రంగా గాయపడితేనే ఇది ఆగుతుందేమో, లేదంటే అతడు బ్రాడ్‌మన్ యావరేజి తప్ప అన్ని రికార్డులను బద్దలు కొడతాడు" అని స్టీవ్‌ వా అన్నాడు.

కోహ్లీ ఖాతాలో మరో మైలురాయి

కోహ్లీ ఖాతాలో మరో మైలురాయి

ఇటీవల వెస్టిండిస్‌తో ముగిసిన ఐదు వన్డేల సిరిస్‌తో విరాట్ కోహ్లీ ఖాతాలో మరో మైలురాయి వచ్చి చేరింది. ఐదు వన్డేల సిరిస్‌లో వరుసగా మూడు సెంచరీలు సాధించడంతో కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డు లభించింది. దీంతో వన్డేల్లో ఏడు మ్యాన్ ఆఫ్ ద సిరిస్‌లను గెలుచుకుని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ల సరసరన సంయుక్తంగా నిలిచాడు.

 గత రెండేళ్లలో పరుగుల వరద పారించిన కోహ్లీ

గత రెండేళ్లలో పరుగుల వరద పారించిన కోహ్లీ

జనవరి, 2016 నుంచి విరాట్ కోహ్లీ అత్యధికంగా 7,824 పరుగులు సాధించాడు. కోహ్లీ సాధించిన 38 సెంచరీల్లో గత రెండేళ్లలోనే 28 సెంచరీలు సాధించడం విశేషం. ఈ సమయంలో అతడి సగటు 75.23గా ఉంది. ఇప్పటివరకు 216 వన్డేలాడిన కోహ్లీ 208 ఇన్నింగ్స్‌లలో 10,232 పరుగులు చేశాడు.

వన్డేల్లో కోహ్లీ అత్యధిక స్కోరు 183

వన్డేల్లో కోహ్లీ అత్యధిక స్కోరు 183

వన్డేల్లో 38 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ అత్యధిక వ్యక్తిగత స్కోరు 183. మరోవైపు కోహ్లీ ఫామ్‌ గమనిస్తే ఏ రికార్డు కూడా భద్రంగా ఉండే పరిస్థితి లేదని మాజీ కెప్టెన్‌ గవాస్కర్‌ వ్యాఖ్యానించాడు. "కోహ్లీ ఫిట్‌నెస్‌ అమోఘం. మరో పదేళ్ల వరకు ఆడగల సత్తా ఉంది. అదే జరిగితే టెస్టులు, వన్డేల్లో అత్యధిక పరుగులు, సెంచరీలన్నీ అతడి ఖాతాలో చేరతాయి" అని గవాస్కర్ అన్నాడు.

టీ20ల్లో అత్యంత వేగంగా 2వేల పరుగుల చేసిన కోహ్లీ

టీ20ల్లో అత్యంత వేగంగా 2వేల పరుగుల చేసిన కోహ్లీ

ఇప్పటివరకు 73 టెస్టులాడిన విరాట్ కోహ్లీ 24 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీల సాయంతో 6,331 పరుగులు సాధించాడు. టెస్టుల్లో కోహ్లీ అత్యధిక వ్యక్తిగత స్కోరు 243. ఇక, 62 టీ20లాడిన కోహ్లీ 2102 పరుగులు చేశాడు. అంతేకాదు టీ20ల్లో అత్యంత వేగంగా రెండు వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు.

Story first published: Monday, November 5, 2018, 13:45 [IST]
Other articles published on Nov 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X