హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అభిమానులతో ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నాడు. మంగళవారం టీమిండియా ఆటగాళ్లు లండన్‌లో భారత హై కమిషన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా మాట్లాడిన కోహ్లీ.. ఇంగ్లాండ్‌తో జరగనున్న రెండో టెస్టును ఉద్దేశించి మాట్లాడాడు. ఒక్కరిద్దరి ఆటగాళ్ల మీద మాత్రమే దృష్టిపెట్టకుండా మొత్తం జట్టుకు మద్దతుగా నిలవాలని టీమ్‌ఇండియా కెప్టెన్ కోహ్లి అభిమానులకు పిలుపునిచ్చాడు.
'మేమంతా జట్టుగా కలిసి ఆడడాన్ని ఇష్టపడతాం. ఒకరి ఆటను మరొకరం ఆస్వాదిస్తాం. నేను అభిమానులకు చెప్పాలనుకుంది ఒకటే... జట్టుకు మద్దతివ్వండి. ఎందుకంటే మేమంతా కలిసి జట్టు గెలుపు కోసం కృషిచేస్తున్నాం. వ్యక్తిగతంగా కాదు. ఏ ఒకరిద్దరు ఆటగాళ్లో కాదు. ఇది టీమ్‌ఇండియా. ఆటగాళ్లంతా జట్టు విజయం కోసమే తపిస్తున్నారు. లండన్‌కు వచ్చి క్రికెట్‌ను ఇష్టపడే వాళ్లతో మాట్లాడడం ఆనందంగా ఉంది' అని కోహ్లి తెలిపాడు.
'తొలి టెస్టులో టీమ్‌ఇండియా బాగా ఆడింది. కొద్దితేడాతో మ్యాచ్‌ను చేజార్చుకున్నాం. క్రికెట్ మక్కా అయిన లార్డ్స్‌లో విజయం సాధించి సిరీస్‌లో దూసుకెళ్తామని అనుకుంటున్నా. ప్రపంచంలోనే కోహ్లి గొప్ప బ్యాట్స్‌మన్' అని వైకే సిన్హా పేర్కొన్నాడు
అయితే ఈ సందర్భంగా తీసిన ఫొటోను బీసీసీఐ తమ అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఆటగాళ్లు, సహాయ సిబ్బందితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ నటి అనుష్కశర్మ కూడా ఉంది. మ్యాచింగ్ డ్రెస్ కోడ్‌తో హాజరైన ఆటగాళ్ల మధ్యలో అనుష్క భారత సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. ఇదే అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.