న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

60 అంతర్జాతీయ సెంచరీలు: సచిన్ రికార్డుని బద్దలు కొట్టిన కోహ్లీ

Virat Kohli breaks Sachin Tendulkars record, fastest to 60 international hundreds

హైదరాబాద్: అభిమానులు ముద్దుగా ఛేజ్ మాస్టర్ అని పిలుచుకునే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీ తాజాగా ఆటతీరుతో మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యంత వేగంగా 60 అంతర్జాతీయ సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

గణాంకాలు: తొలి వన్డేలో చరిత్ర సృష్టించిన రోహిత్, నమోదైన రికార్డులివేగణాంకాలు: తొలి వన్డేలో చరిత్ర సృష్టించిన రోహిత్, నమోదైన రికార్డులివే

ఈ క్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుని సైతం కోహ్లీ బద్దలు కొట్టాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఆదివారం గువహటి వేదికగా విండిస్‌తో జరిగిన తొలి వన్డేలో ఇన్నింగ్స్ 27వ ఓవర్‌లో బౌండరీతో కోహ్లీ తన 36వ సెంచరీని సాధించాడు. ఈ ఏడాది కోహ్లీకి ఇది నాలుగో వన్డే సెంచరీ కావడం విశేషం.

1
44266

సచిన్ రికార్డుని బద్దలు కొట్టిన కోహ్లీ

ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాపై కోహ్లీ మూడు సెంచరీలు బాధిన సంగతి తెలిసిందే. 386 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. సచిన్‌కన్నా 40 ఇన్నింగ్స్‌లు తక్కువ ఆడి ఈ ఘనత సాధించాడు. వన్డేల్లో 36, టెస్టుల్లో 24 సెంచరీలతో ఉన్న ఈ విరాట్ కోహ్లీ మొత్తంగా 60 అంతకన్నా ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్లలో ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్‌ టెండూల్కర్ (100), రికీ పాంటింగ్‌ (71), కుమార సంగక్కర (63), జాక్వస్ కలిస్‌ (62) ముందున్నారు.

కెప్టెన్‌గా 14 సెంచరీలు సాధించిన కోహ్లీ

కెప్టెన్‌గా 14 సెంచరీలు సాధించిన కోహ్లీ

గువహటి వన్డేలో కోహ్లీ సాధించిన సెంచరీ ఛేదనలో అతడికిది 22వ సెంచరీ కాగా స్వదేశంలో 15వది. ఇక, కెప్టెన్‌గా కోహ్లీ సాధించిన సెంచరీల సంఖ్య 14. 50 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్‌ (22) తర్వాతి స్థానంలో కోహ్లీ ఉన్నాడు. పాంటింగ్ 220 ఇన్నింగ్స్‌ల్లో ఈ సెంచరీలు చేశాడు.

అత్యధిక సెంచరీలు చేసిన తొలి ఆటగాడు కోహ్లీ

అత్యధిక సెంచరీలు చేసిన తొలి ఆటగాడు కోహ్లీ

300కి పైగా పరుగుల ఛేదనలో అత్యధిక సెంచరీలు (8) చేసిన తొలి ఆటగాడు కోహ్లీ. అలాగే వరుసగా మూడు కేలండర్‌ ఇయర్స్‌ (20016-18)లో 2000కు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగానూ సచిన్‌, హేడెన్‌, రూట్‌ సరసన నిలిచాడు. గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో కోహ్లీ-రోహిత్ శర్మల జోడీ అనేక రికార్డులను నమోదు చేసింది.

నాలుగో స్థానంలో నిలిచిన కోహ్లీ-రోహిత్‌ జోడీ

నాలుగో స్థానంలో నిలిచిన కోహ్లీ-రోహిత్‌ జోడీ

వన్డేల్లో అత్యధిక సెంచరీల (15) భాగస్వామ్యాలు ఏర్పరచిన ఆటగాళ్లలో కోహ్లీ, రోహిత్‌ శర్మ సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో సచిన్‌, గంగూలీ (26సార్లు) ఉన్నారు. ఛేదనలో రెండో వికెట్‌కు అత్యధిక పరుగుల (246) భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తొలి భారత జోడీ రోహిత్‌-కోహ్లీ నిలిచింది. ఓవరాల్‌గా ఛేదనలో ఇది రెండో అత్యధికం. ఈ జాబితాలో వాట్సన్‌, పాంటింగ్‌ (252) ముందున్నారు.

వన్డే ఛేదనల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమం

వన్డే ఛేదనల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమం

గువహటి వన్డేలో కోహ్లీ, రోహిత్‌ శర్మలు నెలకొల్పిన భాగస్వామ్యం 246 పరుగులు. భారత్‌ తరఫున వన్డే ఛేదనల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమం. 2009లో కోహ్లీ, గంభీర్‌ 224 పరుగులతో నెలకొల్పిన రికార్డు కనుమరుగైంది. ఇప్పటివరకు వన్డేల్లో కోహ్లీ, రోహిత్‌ శర్మ డబుల్‌ సెంచరీ భాగస్వామ్యాల సంఖ్య 5. మరే జోడీ మూడుకు మించి డబుల్ సెంచరీలు సాధించలేదు.

Story first published: Monday, October 22, 2018, 13:10 [IST]
Other articles published on Oct 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X