న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోహ్లీ అలా అనడంలో తప్పేమీ కనిపించడం లేదు'

Virat Kohli bashing is an act of mischievous targeting: Mohammad Kaif

హైదరాబాద్: పుట్టినరోజు సందర్భంగా నవంబరు5న విరాట్ కోహ్లీ అధికారికంగా తన పేరు మీద ఓ యాప్‌ను విడుదల చేశాడు. అభిమానులకు తన గురించిన సమాచారం అంతా ఒకే చోట దొరకాలనే ఉద్దేశ్యంతో సమగ్ర సమాచారాన్ని అందులో పొందుపరిచారు. దీనిపై స్పందించి పలువురు నెటిజన్లు వారి మనసులో మాటను బయటపెడుతూ కెప్టెన్ కోహ్లీతో విదేశీ క్రికెటర్లంటే ఇష్టం భారత క్రికెటర్లు నచ్చరనే అర్థంతో మాట్లాడటంతో కోహ్లీకి కోపమొచ్చింది.

పొగడడం.. తిట్టడం వల్ల ఒరిగేదేమీ లేదని

పొగడడం.. తిట్టడం వల్ల ఒరిగేదేమీ లేదని

ఓ అభిమానిని దేశం వదిలి వెళ్లిపోమని, తనను పొగడడం.. తిట్టడం వంటి వాటి వల్ల ఒరిగేమీ లేదని కోహ్లి అనడంపై పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ విషయం ప్రముఖ సోషల్ మీడియా సీరియస్‌గా స్పందించింది. కామెంటేటర్ హర్షాభోగ్లేలాంటి వాళ్లు కూడా కోహ్లి తీరును తప్పుబట్టారు. అయితే మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మాత్రం విరాట్‌కు అండగా నిలిచాడు. అసలు అతడు చెప్పిన దానిలో తనకు తప్పు కనిపించడం లేదని చెప్పుకొచ్చాడు.

ఎవరిష్టం వారిది అనడానికిదే నిదర్శనం:

ఎవరిష్టం వారిది అనడానికిదే నిదర్శనం:

ఎవరి ప్రకారం వాళ్లు ప్రకటనలను ఎలా మార్చుకుంటారో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. గతంలో కోహ్లి కూడా విదేశీ క్రీడాకారులను మెచ్చుకున్నాడు. అతడు పూర్తిగా వేరే ఉద్దేశంతో ఈ కామెంట్ చేశాడు. కానీ కొంతమంది అతణ్ని కావాలని లక్ష్యంగా చేసుకుంటున్నారు అని కైఫ్ ట్వీట్ చేశాడు.

కోహ్లీని సదరు అభిమాని ఏమన్నాడంటే:

కోహ్లీని సదరు అభిమాని ఏమన్నాడంటే:

కోహ్లిని ఎక్కువ చేసి చూపించారని, అతని బ్యాటింగ్ కంటే తనకు ఇంగ్లిష్, ఆస్ట్రేలియా క్రికెటర్ల బ్యాటింగే నచ్చుతుందని అన్నాడు. దీనిపై కోహ్లి స్పందిస్తూ అలా అయితే నువ్వు దేశం వదిలి వెళ్లిపో అని సదరు అభిమానికి ఘాటుగా రిైప్లె ఇచ్చాడు. ఈ విషయంలో కొంతమంది కోహ్లికి మద్దతు తెలపగా.. ఎక్కువ మంది అతనిపై విమర్శలు గుప్పించారు.

కైఫ్ శైలికి ఈ ఘటన దగ్గరగా ఉండడం వల్లనే

కైఫ్ శైలికి ఈ ఘటన దగ్గరగా ఉండడం వల్లనే

ఓ రకంగా చూస్తే కైఫ్ శైలికి ఈ ఘటన దగ్గరగా ఉండడం వల్ల కోహ్లీని సమర్థిస్తుండొచ్చు. ఇటీవల షేన్ వార్న్ తన ఆత్మకథను 'నో స్పిన్‌' అనే పుస్తక రూపంలో విడుదల చేశాడు. అందులో కైఫ్ గురించి రాజస్థాన్ రాయల్స్ కోచ్‌గా ఉన్నప్పుడు ఘటన రాసుకొచ్చాడు. నేను కైఫ్‌ను అనే మాటను రిసెప్షనిస్ట్ దగ్గర పదేపదే చెప్పి.. తనకు పెద్ద గదినివ్వాలిని తాను టీమిండియా తరపున ఆడిన వాడినంటూ చెప్పుకున్నాడని గుర్తు చేసుకున్నాడు. ఇలా క్రికెటర్‌లు గొప్పలు చాటుకునే విధంగా ఉన్నాడని కైఫ్ వెనకేసుకొచ్చాడా అనేది శోచనీయం.

Story first published: Friday, November 9, 2018, 16:18 [IST]
Other articles published on Nov 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X