న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విదేశీ క్రికెటర్లను ఇష్టపడితే దేశం వదిలిపోవాలా?: కోహ్లీ వ్యాఖ్యలపై దుమారం

Virat kohli Trolled For Asking A Fan To Leave India | Oneindia Telugu
Virat Kohli Asks A Cricket Lover To Leave India, Faces Backlash On Twitter

హైదరాబాద్: ఓ అభిమాని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్‌ 5 విరాట్ కోహ్లీ 30వ పుట్టినరోజుని జరుపుకున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ తన పేరిట ఓ యాప్‌ను ప్రారంభించాడు.

బాల్ టాంపరింగ్: స్మిత్‌, వార్నర్‌లపై నిషేధం ఎత్తివేసే ఆలోచనలో సీఏ?బాల్ టాంపరింగ్: స్మిత్‌, వార్నర్‌లపై నిషేధం ఎత్తివేసే ఆలోచనలో సీఏ?

కోహ్లీ చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు వివాదాస్పదం

అనంతరం అభిమానులతో కోహ్లీ కాసేపు చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా కోహ్లీ చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు వివాదాస్పదమైంది. ఓ క్రికెట్ అభిమాని విరాట్ కోహ్లీని ‘‘ఓవర్‌రేటెడ్ ప్లేయర్'' అని పేర్కొన్నాడు. ‘‘విరాట్ కోహ్లీ ఓ ఓవర్‌రేటెడ్ బ్యాట్స్‌మెన్. అతనిలో నాకు ఏదీ ప్రత్యేకంగా కనిపించదు. ఇండియా వాళ్ల కంటే ఇంగ్లీష్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ల బ్యాటింగ్ నాకు ఎంతో నచ్చుతుంది'' అని పేర్కొన్నాడు.

నువ్వు భారత్‌లో ఉండాల్సిన వాడివి కాదు

నువ్వు భారత్‌లో ఉండాల్సిన వాడివి కాదు

ఈ వ్యాఖ్యలపై విరాట్‌ కోహ్లీ సమాధానమిస్తూ ‘‘నువ్వు భారత్‌లో ఉండాల్సిన వాడివి కాదు. ఎక్కడికైనా వెళ్లి బతుకు. ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలు మాత్రమే నీకు సరైనవి. దేశం విడిచి వెళ్లిపో. వేరే దేశాలను ప్రేమిస్తూ.. ఇక్కడ ఎందుకు ఉండటం. నీవు నన్ను అభిమానించ మాత్రాన నాకేం కాదు. నీకు ఈ దేశం సరైంది కాదు. కానీ ఇక్కడ ఉంటూ వేరే దేశాన్ని పొగడటం నాకు ఇష్టం ఉండదు'' అని అన్నాడు.

విదేశీ క్రికెటర్లను ఇష్టపడితే దేశం వదిలిపోవాలా?

కోహ్లీ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇతర దేశాల క్రికెటర్లను ఇష్టపడటం వ్యక్తిగత అభిప్రాయమని.. ఆ మాత్రనికి దేశం వదిలి వెళ్లమని అనడం సరైంది కాదని నెటిజన్లు అంటున్నారు. మీరు విదేశీ దుస్తులు ధరిస్తారు, విదేశంలో పెళ్లి చేసుకుంటారు, వీదేశీ భాషలో మాట్లాడుతారు. ఇవేవీ తప్పులు కాదు. కానీ విదేశీ క్రికెటర్లను ఇష్టపడితే.. మాత్రం దేశం వదిలిపోవాలా? అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

Story first published: Thursday, November 8, 2018, 12:39 [IST]
Other articles published on Nov 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X