ప్లీజ్‌.. మా పాప ఫొటోలు తీయొద్దు!! సమయం వచ్చినప్పుడు నేనే చూపిస్తా: కోహ్లీ

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ సోమవారం తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. అనుష్క సోమవారం మధ్యాహ్నం పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సంతోషకరమైన వార్తను పంచుకోవడానికి చాలా థ్రిల్‌గా ఫీలవుతున్నానని, తల్లీకూతుళ్లిద్దరూ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నాడు. అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అని విరాట్ చెప్పాడు. అయితే పాప ఫొటోను మాత్రం భారత కెప్టెన్ పోస్ట్ చేయలేదు.

ముంబై ఫొటోగ్రాఫ‌ర్లకు లేఖ

ముంబై ఫొటోగ్రాఫ‌ర్లకు లేఖ

విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ దంపతుల కుమార్తె తొలి ఫొటో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలానే ముంబై మీడియా కూడా ఫొటోల కోసం ఆతృతగా ఉంది. అయితే ద‌య‌చేసి తమ పాప ఫొటోలు తీయొద్దని విరుష్క జోడి ముంబై ఫొటోగ్రాఫ‌ర్ల‌ను కోరారు. త‌మ కూతురి ప్రైవ‌సీని గౌర‌వించాల‌ని వారు ఫొటోగ్రాఫ‌ర్ల‌కు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. 'హాయ్.. ఇన్ని సంవత్సరాలుగా మీరు మా మీద చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. పాప పుట్టిన ఆనంద క్షణాలను మీతో పంచుకోవడం మాకు సంతోషంగా ఉంది' అని కోహ్లీ, అనుష్క తమ లేఖలో పేర్కొన్నారు.

ప్లీజ్‌.. పాప ఫొటోలు తీయొద్దు

ప్లీజ్‌.. పాప ఫొటోలు తీయొద్దు

'త‌ల్లిదండ్రులుగా మేము కోరుతున్న‌ది ఒక‌టే. మా పాప ప్రైవ‌సీని ర‌క్షించాల‌ని అనుకుంటున్నాం. దానికి మీ సాయం, మ‌ద్ద‌తు కావాలి. ద‌య‌చేసి మా పాప ఫొటోలు తీయొద్దు. స‌రైన స‌మ‌యంలో పాప ఫొటోల‌ను మేమే రిలీజ్ చేస్తాం. పాపకు సంబంధించి ఎలాంటి కంటెంట్ కూడా రాయొద్దు. అన్ని వివరాలు తెలియజేస్తాం. ఇది అర్ధం చేసుకుంటారనుకుంటున్నాం. మీకు ధన్యవాదాలు' అని ముంబై ఫొటోగ్రాఫ‌ర్లకు రాసిన లేఖలో విరుష్క జోడి కోరింది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తర్వాత విరాట్‌ కోహ్లీ పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి వచ్చాడు. తమకు తొలి బిడ్డ జన్మిస్తున్న క్షణాల్లో భార్య అనుష్క శర్మ పక్కనే ఉండాలని నిర్ణయించుకున్న కోహ్లీ.. ప్రస్తుతం ఆ మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నాడు.

సోషల్ మీడియాలోనూ పేరుపై చర్చ

సోషల్ మీడియాలోనూ పేరుపై చర్చ

విరాట్ కోహ్లీ కూతురు పేరుపై అప్పుడే సోషల్ మీడియాలోనూ చర్చ మొదలైంది. కోహ్లీ, అనుష్క జంటను అంతా 'విరుష్క' అని పిలుస్తుంటారు. కాబట్టి ఈ పేరే పెట్టే అవకాశం ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. పాపకు 'అన్వీ' అనే పేరు పెడతారని కూడా టాక్ వినిపిస్తోంది. Anushka పేరులోని మొదటి రెండు అక్షరాలు AN.. VIRAT పేరులోని మొదటి రెండు అక్షరాలు VI కలిపితే ANVI అవుతుంది.

ఆ ఫోటో కాదు

ఆ ఫోటో కాదు

కోహ్లీ సోదరుడు వికాస్‌ కోహ్లీ సోమవారం చిన్నారి పాప ఫొటోను ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. తెల్లటి బ్లాంకెట్‌లో పాపాయిని చుట్టి ఉండగా.. కాళ్లు కనపడేలా ఆ ఫొటో ఉంది. ఆ ఫొటోకు 'స్వాగతం' అని వికాస్‌ కోహ్లీ పేర్కొన్నాడు. ఇప్పుడు తమ కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని, తమ ఇంట్లోకి లిటిల్‌ ఏంజిల్‌ వచ్చిందని అతడు పేర్కొన్నాడు. ఫోటోలో చిన్న పాప ఉండటంతో తను కోహ్లీ కూతురేనని అందరూ అభిప్రాయపడ్డారు. పెద్ద ఎత్తున లైకులు, షేర్లు కొట్టారు. అయితే ఆ ఫోటో కోహ్లీ కూతురుది కాదట. ఏదో విషెస్ చెప్పడానికి వికాస్‌ ఆ ఫోటోను ఉపయోగించుకున్నాడట.

బ్రిస్బేన్ టెస్టులో వాషింగ్టన్‌ సుందర్‌ అరంగేట్రం.. నటరాజన్‌ మళ్లీ బెంచ్‌కే! తుది జట్టు ఇదే!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Wednesday, January 13, 2021, 14:58 [IST]
Other articles published on Jan 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X