న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రూ. 1000 కోట్లకు విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల నెట్ వర్త్

By Nageshwara Rao
Virat Kohli-Anushka Sharma's joint net worth to reach Rs 1000 crore in two years, says brand expert

హైదరాబాద్: మూడు ముళ్ల బంధంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు వరకు విడివిడిగా సంపాదించిన వీరు, పెళ్లి తర్వాత ఉమ్మడి బ్రాండ్‌గా మారారంటూ ప్రముఖ బ్రాండ్ అనలిస్ట్ షైలేంద్ర సింగ్ అన్నారు.

అనుష్క-విరాట్ ఆస్తుల విలువ తెలిస్తే షాకే !

పెళ్లితో పాటు వీరికి ఉన్న క్రేజ్ రెట్టింపు చేసుకోవడంతో పాటు రాబోయే రోజుల్లో తమ బ్రాండ్‌ను మరింతగా పెంచుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పెళ్లితో వీళ్ల బ్రాండ్ వ్యాల్యూ కూడా పెరిగినట్టే అని.. వీళ్ల సంపాదన మరింత పెరగబోతోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పెళ్లి అనంతరం వీరిద్దరి బ్రాండ్ వ్యాల్యూ, నెట్ వర్త్ గురించి మార్కెట్ నిపుణులు వివిధ అంచనాలకు వచ్చారు. వాటి ప్రకారం అనుష్క శర్మ ఆస్తుల విలువ సుమారు 220 కోట్ల రూపాయలుగా ఉంది. హీరోయిన్ పలు సినిమాల్లో నటించడంతో పాటు నిర్మాతగా కొన్ని సినిమాలను కూడా నిర్మించింది.

బాలీవుడ్‌లో తన కెరీర్ ప్రారంభించిన పదేళ్లలోనే ఈ స్థాయికి రావడం అంటే మామూలు విషయం కాదంటున్నారు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విషయానికి వస్తే అతి తక్కువ కాలంలో భారత క్రికెట్‌పై తనదైన ముద్రను వేశాడు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుల్లో పెద్దమొత్తం సంపాదిస్తున్న వాళ్లలో కోహ్లీ ఒకడు.

దీంతో ఇప్పటివరకు కోహ్లీ సుమారు 330 కోట్ల రూపాయల ఆస్తులను పోగేశాడని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. దీనిని బట్ట చూస్తే వీళ్లిద్దరి ఆస్తుల విలువను కలిపి చూస్తే సుమారు రూ. 600 కోట్ల రూపాయల పైనే అవుతుంది. రాబోయే రోజుల్లో ఈ పెరుగుదల మరింతగా ఉంటుందని భావిస్తున్నారు.

ఈ క్రమంలో రానున్న మూడు సంవత్సరాల్లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల ఆస్తుల విలువ ఉమ్మడిగా వెయ్యి కోట్ల రూపాయల వరకూ పెరిగే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 14, 2017, 12:52 [IST]
Other articles published on Dec 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X