న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ.. అనుష్కలు ఎలా ఉండాలో ముందుగానే చెప్పా: హర్భజన్

Virat Kohli, Anushka Sharma Get Relationship Advice From Harbhajan Singh

ముంబై: టీమిండియా వెటరన్ క్రికెటర్ స్పిన్ సంచలనం హర్భజన్‌ సింగ్‌.. టీమిండియా కెప్టెన్ కోహ్లీ వైవాహిక జీవితానికి సూచనలిచ్చాడట. ఈ విషయాన్ని తానే ఇటీవల పాల్గొన్న ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ నటి నేహా ధూపియా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న టీవీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. 'నో ఫిల్టర్ నేహా' అనే కార్యక్రమంలో తన వ్యక్తిగత విషయాలు పంచుకున్న హర్భజన్ సహచరుల గురించి కూడా చెప్పుకొచ్చాడు.

ఒకరి పరిస్థితిని మరొకరు అర్థం చేసుకుంటే

ఒకరి పరిస్థితిని మరొకరు అర్థం చేసుకుంటే

ఈ నేపథ్యంలోనే విరాట్‌, అనుష్కకు వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ సలహా ఇచ్చానని చెప్పుకొచ్చాడు. ‘వైవాహిక జీవితంలో సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. ఆ సమయంలో ఒకరికొకరు తోడుగా నిలవాలి. ఒకరి పరిస్థితిని మరొకరు అర్థంచేసుకోగలగాలి. అప్పుడే ఇద్దరి జీవితాలు మరింత మెరుగవుతాయి' అని సలహా ఇచ్చాడట.

విరుష్కా జోడీకి మాత్రమే కాదట

విరుష్కా జోడీకి మాత్రమే కాదట

ఈ భజ్జీ సలహాలు విరుష్కా జోడీకి మాత్రమే కాదట. పాక్ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాలకు, మాజీ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌, బాలీవుడ్ నటి సాగరిక ఘట్గేకు కూడా ఉచిత సలహాలిచ్చేశాడట. అందరికీ ఒకే విధంగా కాదు. వారివారి వ్యక్తిత్వాలను బట్టి సూచనలు ఇచ్చాడట.

షోయబ్‌-సానియాలకు ఎక్కువ సమయం

షోయబ్‌-సానియాలకు ఎక్కువ సమయం

షోయబ్‌-సానియాలకు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపితే మంచిదని చెప్పారట. జహీర్‌-సాగరికలకు మాత్రం కొంతకాలం ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉంటేనే మంచిదంటూ చెప్పానని భజ్జీ చమత్కరించాడు.

ఆశించినంత మేర ఆకట్టుకోలేక

ఆశించినంత మేర ఆకట్టుకోలేక

ఈ ఏడాది ఆరంభంలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన భజ్జీ ఆశించినంత మేర ఆకట్టుకోలేకపోయాడు. పరుగులతో పాటు వికెట్లు కూడా తీయకపోవడంతో అతని ఐపీఎల్ కెరీర్ మున్ముందుకు ప్రశ్నార్థకంగా మారింది.

Story first published: Friday, November 30, 2018, 14:32 [IST]
Other articles published on Nov 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X