న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇక ఆడింది చాలు.. ఐపీఎల్ నుంచి కోహ్లీ, డివిలియర్స్‌ను బ్యాన్ చేయాలి: కేఎల్ రాహుల్

Virat Kohli and AB De Villiers should be Banned from IPL says KL Rahul

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020‌లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఎన్నడూ లేని విధంగా అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచుల్లో 5 గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. బెంగళూరు ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్‌ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

2011 నుంచి బెంగళూరు తరఫున ఆడుతున్న వీరిద్దరూ ఐపీఎల్‌లో 10 శతక భాగస్వామ్యాలు నెలకొల్పారు. అయితే బెంగళూరు గురువారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుతో తలపడనుంది. ఈ సందర్భంగా ఇరు జట్ల సారథులు పూమా ఇండియా నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో పాల్గొన్నారు.

 కోహ్లీ, డివిలియర్స్‌ను బ్యాన్ చేయాలి

కోహ్లీ, డివిలియర్స్‌ను బ్యాన్ చేయాలి

ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో పాల్గొన్న పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌.. బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు ఓ అవకాశం వస్తే గనుక వీరిద్దరిపై నిషేధం విధించాలని ఐపీఎల్‌ నిర్వాహకులను కోరతానన్నాడు. టీ20ల్లో ఏ రూల్‌ను మారిస్తే బాగుంటుందని విరాట్.. అడిగిన ప్రశ్నకు రాహుల్ ఇలా సరదాగా సమాధానం ఇచ్చాడు. 5 వేల పరుగులు చేస్తే ఇక ఐపీఎల్‌లో ఆడటం చాలంటూ.. కోహ్లీని ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించాడు.

ఐపీఎల్ నిర్వాహకులను అడుగుతా

ఐపీఎల్ నిర్వాహకులను అడుగుతా

'వచ్చే ఏడాది విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ ఐపీఎల్‌ ఆడకుండా నిషేధం విధించాలని ఐపీఎల్ నిర్వాహకులను అడుగుతాను. ఎందుకంటే.. ఒకానొక సమయంలో నిర్దిష్టమైన పరుగులు చేసిన తర్వాత ప్రేక్షకులే ఇక చాలు అంటారు. 5 వేల మార్కును చేరుకుంటే చాలు. ఆ తర్వాత వేరే వాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలి కదా' అంటూ కోహ్లీతో రాహుల్ జోక్‌ చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 5,668 పరుగులతో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. సురేష్ రైనా, రోహిత్ శర్మలు కూడా 5 వేల జాబితాలో ఉన్నాడు. మరోవైపు డివిలియర్స్ 4,623 రన్స్ చేశాడు.

సిక్స్‌ కొట్టిన ఆటగాడికి ఎక్కువ పరుగులు ఇవ్వాలి

సిక్స్‌ కొట్టిన ఆటగాడికి ఎక్కువ పరుగులు ఇవ్వాలి

మరికొన్ని అంశాలపై కూడా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌ చర్చించారు. 'భారీ షాట్‌ ఆడి (100 మీటర్లకు పైగా) సిక్స్‌ కొట్టిన ఆటగాడికి ఆరు కంటే ఎక్కువ పరుగులు ఇచ్చే నిబంధన తీసుకువస్తే బాగుంటుంది. ఓ బ్యాట్స్‌మెన్‌గా ఇది నా అభిప్రాయం' అని రాహుల్‌ అన్నాడు. ఈ విషయం గురించి ముందుగా బౌలర్లతో మాట్లాడాలి అంటూ కోహ్లీ సెటైర్ వేశాడు. ఆపై రాహుల్ మాట్లాడుతూ... ఓ బ్యాటర్‌గా మాత్రమే తన అభిప్రాయం చెప్పానన్నాడు. చివరగా.. వైడ్‌ రివ్యూ గురించి చేసిన కోహ్లీ ప్రతిపాదనను రాహుల్‌ స్వాగతించాడు.

తొలి భారత క్రికెటర్‌గా

తొలి భారత క్రికెటర్‌గా

ఇటీవలే టీ20ల్లో 9 వేల రన్స్ మైలురాయిని విరాట్ కోహ్లీ చేరుకున్నాడు. దీంతో టీ20ల్లో 9 వేల రన్స్ చేసిన తొలి భారత క్రికెటర్‌గా కోహ్లీ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. మొత్తంగా టీ20ల్లో 9 వేల రన్స్ చేసిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 9వేల పరుగుల మైలురాయి అందుకున్న జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ ‌గేల్ (13296) టాప్‌లో ఉండగా.. కీరన్ పొలార్డ్ (10370), షోయబ్ మాలిక్ (9926), బ్రెండన్ మెకకల్లమ్ (9922), డేవిడ్ వార్నర్ (9451), ఆరోన్ ఫించ్ (9148) విరాట్ కన్నా ముందున్నారు.

IPL 2020: డ్రింక్స్‌ అందించడంలో తప్పేముంది.. అది నా డ్యూటీ: స్టార్ స్పిన్నర్

Story first published: Thursday, October 15, 2020, 16:12 [IST]
Other articles published on Oct 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X