న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోహ్లీ ఎప్పుడో లెజెండరీ క్రికెటర్ల జాబితాలో చేరిపోయాడు'

By Nageshwara Rao
Virat Kohli already a legend, says Pakistan’s Zaheer Abbas

లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జహీర్‌ అబ్బాస్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ దిగ్గజ ఆటగాడేనని, దానిని ప్రత్యేకించి ప్రస్తావించనవసరం లేదని అన్నాడు. ఈ తరంలో కోహ్లీ క్రికెట్‌ను శాసిస్తున్నాడని, ఒక్కో తరంలో ఒక్కో ఆటగాడు ఆధిపత్యం ప్రదర్శిస్తాడని చెప్పాడు.

లార్డ్స్‌లో 107 ఆలౌట్: కోహ్లీ సేనకు మద్దతుగా నిలిచిన అమితాబ్, రోహిత్, సెహ్వాగ్లార్డ్స్‌లో 107 ఆలౌట్: కోహ్లీ సేనకు మద్దతుగా నిలిచిన అమితాబ్, రోహిత్, సెహ్వాగ్

విరాట్ కోహ్లీ ఎప్పుడో లెజెండరీ క్రికెటర్ల జాబితాలో చేరిపోయాడని అన్నాడు. ఒకతరం ఆటగాడితో మరో తరం ఆటగాడిని పోల్చడం సరికాదన్న అబ్బాస్‌.. ప్రస్తుత క్రికెట్‌ ప్రపంచంలో కోహ్లీ మెరుగైన ఆటగాడంటూ కితాబిచ్చాడు. వికెట్‌కు ఇరువైపులా తనదైన శైలితో షాట్లను సంధించే కోహ్లీ ఇట్టే ఆకట్టుకుంటున్నాడని తెలిపాడు.

1
42375

ఎడ్జ్‌బాస్టన్‌లో అతని ఆట తనను ఎంతగానో ముగ్ధుడిని చేసిందని, సిరీస్‌ మొత్తం అదే ఆటతీరును ప్రదర్శిస్తాడన్న ఆశాభావం వ్యక్తంచేశాడు. ఇక, జహీర్ అబ్బాస్ విషయానికి వస్తే ఉపఖండంలో 100 ఫస్ట్ క్లాస్ సెంచరీలు చేసిన మొట్టమొదటి క్రికెటర్. పాక్ తరుపున జహీర్ అబ్బాస్ టెస్టుల్లో 5062 పరుగులు, వన్డల్లో 2572 పరుగులు నమోదు చేశాడు.

5/20: లార్డ్స్‌లో ఆండర్సన్ నెలకొల్పిన అరుదైన రికార్డులివే5/20: లార్డ్స్‌లో ఆండర్సన్ నెలకొల్పిన అరుదైన రికార్డులివే

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌‌లో భాగంగా ప్రస్తుతం లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. తొలి టెస్టులో ఎదురైన ఓటమికి ప్రతిష్టాత్మక లార్డ్స్‌లో బదులిస్తారేమో అని అభిమానులు ఆశించినా టీమిండియా ఆటతీరులో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.

తొలి రోజులాగే రెండో రోజు కూడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో రెండు సెషన్లలో కేవలం 8.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వర్షం దోబూచులాడిన రెండో రోజు ఆఖరి ఇన్నింగ్స్‌ మాత్రమే పూర్తిగా సాగగా ఇంగ్లండ్‌ పేసర్లు కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతులతో చెలరేగారు.

లార్డ్స్‌లో భారత్ 107 ఆలౌట్: ఆండర్సన్‌ అరుదైన రికార్డు (ఫోటోలు)లార్డ్స్‌లో భారత్ 107 ఆలౌట్: ఆండర్సన్‌ అరుదైన రికార్డు (ఫోటోలు)

ముఖ్యంగా జేమ్స్‌ ఆండర్సన్‌ (5/20) ధాటికి భారత్‌ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 35.2 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. రవిచంద్రన్ అశ్విన్‌ (29) మాత్రమే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మరో బౌలర్ క్రిస్ వోక్స్‌కు రెండు వికెట్లు దక్కాయి.

Story first published: Saturday, August 11, 2018, 14:29 [IST]
Other articles published on Aug 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X