న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిషబ్ పంత్‌కు ఆ తేడా తెలియాలి! టెస్టు ఓపెనర్‌గా రోహిత్

Vikram Rathour feels fearless Rishabh Pant cant afford to be careless; backs Rohit Sharma as Test opener

హైదరాబాద్: భయం లేకుండా ఆడటం.. అజాగ్రత్తగా ఉండటం మధ్య ఉన్న తేడాను టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ తెలుసుకోవాలని ఇటీవలే టీమిండియాకు బ్యాటింగ్ కోచ్‌గా నియమింపబడిన విక్రమ్ రాథోర్ సూచించాడు. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా ట్రినిడాడ్‌ మ్యాచ్‌లో తొలి బంతికే రిషబ్ పంత్ ఔటైన సంగతి తెలిసిందే.

అలాంటి చెత్త షాట్‌ మళ్లీ రిపీట్‌ అయితే మా నిర్ణయాలు కఠినంగా ఉంటాయని రిషబ్ పంత్‌తో కోచ్ రవిశాస్త్రి హెచ్చరించిన రెండు రోజులకే బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ తాజాగా స్పందించాడు. మొహాలీ వేదికగా బుధవారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 జరగనున్న సంగతి తెలిసిందే.

150 kmph వేగంతో బౌలింగ్‌ చేసే భారత బౌలర్‌ని చూశారా?150 kmph వేగంతో బౌలింగ్‌ చేసే భారత బౌలర్‌ని చూశారా?

వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్ కోసం బలమైన జట్టుని రూపొందించే క్రమంలో జట్టు మేనేజ్‌మెంట్ పంత్‌కు పదే పదే అవకాశాలు ఇస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, రిషబ్ పంత్ వాటిని అందిపుచ్చుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నాడు. ఇటీవలే వెస్టిండిస్‌తో ముగిసిన సిరిస్‌లో సైతం పంత్ పెద్దగా రాణించలేదు.

రిషబ్ పంత్ బ్యాటింగ్ టెక్నిక్‌తో

రిషబ్ పంత్ బ్యాటింగ్ టెక్నిక్‌తో

ఈ మ్యాచ్‌కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో విక్రమ్ రాథోర్... రిషబ్ పంత్ బ్యాటింగ్ టెక్నిక్‌తో పాటు టెస్టుల్లో ఓపెనర్‌గా రోహిత్ శర్మను బరిలోకి పంపే అవకాశాలపై స్పందించాడు. రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రిషబ్ పంత్ టీ20 యావరేజి 21.57గా ఉంది. ఒకే తరహా షాట్‌కు ఔట్‌ కావడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

విక్రమ్ రాథోర్ మాట్లాడుతూ

విక్రమ్ రాథోర్ మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో విక్రమ్ రాథోర్ మాట్లాడుతూ "పంత్ అన్ని షాట్లను ఆడాలని మేము కోరుకుంటున్నాం. అదే అతనికి ప్రత్యేకతను ఇస్తుంది. అతడు అద్భుతమైన ప్లేయర్... అదే సమయంలో అతడు అజాగ్రత్తగా ఉండకూడదు. జట్టులోని యువ క్రికెటర్లు అందరూ భయం లేకుండా ఆడటం.. అజాగ్రత్తగా ఉండటం మధ్య ఉన్న తేడా తెలిసుండాలి" అని పేర్కొన్నాడు.

రోహిత్ శర్మ ఎంపిక

రోహిత్ శర్మ ఎంపిక

అక్టోబర్ 2 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం రోహిత్ శర్మను తిరిగి టెస్టులకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. సొంతగడ్డపై ఓపెనర్‌గా రోహిత్ శర్మ రాణిస్తాడని.. మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, ఆడమ్ గిల్ క్రిస్ట్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఓపెనర్‌గా రోహిత్ శర్మ

ఓపెనర్‌గా రోహిత్ శర్మ

దీనిపై విక్రమ్ రాథోర్ మాట్లాడుతూ "ఏ జట్టులోనూ ఆడకపోయినా రోహిత్ శర్మ చాలా మంచివాడు అనేది నా అభిప్రాయం. ప్రతి ఒక్కరూ ఇదే అభిప్రాయంతో ఉంటారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన ఓపెనింగ్ బ్యాట్స్‌మన్. దీంతో అతడు టెస్టుల్లో విజయవంతం కాకపోవడానికి ఎటువంటి కారణం లేదు. రోహిత్ గనుక తన గేమ్‌ప్లాన్‌ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే... జట్టుకు గొప్ప ఆస్తి అవుతాడు" అని అన్నాడు.

Story first published: Tuesday, September 17, 2019, 17:21 [IST]
Other articles published on Sep 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X