న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పాంటింగ్ మాటలు నా ఆటను మార్చాయి'

Vijay Shankar Credits Coach Ponting for Turnaround in IPL

హైదరాబాద్: ఐపీఎల్‌లో అంతర్జాతీయ క్రికెటర్లు, విదేశీ కోచ్‌లు అందరూ అందుబాటులో ఉండడంతో యువ క్రికెటర్లకు నేర్చుకునేందుకు చాలా అవకాశం లభిస్తుంది. ఇలాగే చాలా మంది క్రికెటర్లు ఐపీఎల్‌లోనే చాలా వరకూ నేర్చుకోగలిగామంటూ చెప్పుకొస్తుంటారు. ఇప్పుడు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు విజయ్ శంకర్ సైతం అదే పాట పాడుతున్నాడు.

ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్ సూచనలతో తన ఆటతీరు పూర్తిగా మెరుగుపడిందని ఢిల్లీ జట్టు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ తెలిపాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్‌లో మొత్తం 13 మ్యాచ్‌లాడిన శంకర్.. 212 పరుగులు చేశాడు. టోర్నీ జరిగిన తీరు చూస్తే.. అతను చేసిన పరుగులు కనీసం పరిగణలోకి తీసుకోవాల్సినవి కావు. కానీ.. అతను లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసి ఆ పరుగులు సాధించడంతో వాటికి విలువ చేకూరింది. ముఖ్యంగా.. డెత్ ఓవర్లలో క్రీజులోకి వచ్చి శంకర్ హిట్టింగ్ చేసిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. తాజా సీజన్‌లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 54గా ఉండటం అతని దూకుడుకి నిదర్శనం.

'ఐపీఎల్ 2018 సీజన్‌లో రెండో మ్యాచ్ ముగిసిన తర్వాత కోచ్ రికీ పాంటింగ్ దగ్గరకి వెళ్లాను. నా ఆటకి ఎలా మెరుగులు దిద్దుకోవాలో సూచించాలని కోరాను. అప్పటికి నేను చాలా కఠిన పరిస్థితుల్లో ఉన్నట్లు ఊహించుకున్నా. కానీ.. రికీ పాంటింగ్.. నీ బ్యాటింగ్‌ టెక్నిక్‌ని మళ్లీ అందుకో చాలు.. అని చాలా తేలికపాటి సూచన చేశాడు. ఆ సూచనతో.. మ్యాచ్‌కి అనుగుణంగా ఆడటం నేర్చుకున్నా. కచ్చితంగా ఈ ఏడాది ఐపీఎల్‌ నా ఆటను మార్చేసింది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ స్థానాలు మార్చి బ్యాటింగ్‌ చేయాల్సి రావడంతో.. పరిస్థితులకి అనుగుణంగా ఆటతీరు మార్చుకున్నా' అని విజయ్ శంకర్ వెల్లడించాడు.

ఈ ఏడాది మార్చి 18న బంగ్లాదేశ్‌తో జరిగిన ముక్కోణపు సిరీస్ ఫైనల్లో 19 బంతులాడిన విజయ్ శంకర్ కేవలం 17 పరుగులు మాత్రమే చేసి పేలవ రీతిలో ఔటయ్యాడు. ముఖ్యంగా.. ఆఖర్లో బంతుల్ని ఎక్కువగా వృథా చేయడంతో అతనిపై విమర్శల వర్షం కురిసింది. దీంతో.. తీవ్ర ఒత్తిడి మధ్య ఐపీఎల్ 2018 సీజన్‌ని ఆరంభించిన శంకర్.. తొలి మ్యాచ్‌లోనే విఫలమయ్యాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 బంతులాడి కనీసం ఒక బౌండరీ కూడా కొట్టలేక 13 పరుగుల వద్దే ఔటయ్యాడు. రెండో మ్యాచ్‌లోనూ 3 పరుగులకే వికెట్ చేజార్చుకున్నాడు.

Story first published: Thursday, May 31, 2018, 16:00 [IST]
Other articles published on May 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X