న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మళ్లీ ఢిల్లీ జట్టు పగ్గాలు గంభీర్‌కే, కీపర్‌గా పంత్

Vijay Hazare Trophy 2018-19- Gautam Gambhir to lead Delhi

న్యూ ఢిల్లీ: 'ద ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్' సోమవారం విజయ్ హజారే ట్రోఫీ 2018లో భాగంగా 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఈ లీగ్‌కు కెప్టెన్ బాధ్యతలు గౌతం గంభీర్ వహించనుండగా వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ వ్యవహరించనున్నాడు. గతేడాది ముగిసిన సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ నాలుగింటిలో ఓటమిని చవిచూసింది.

పాలం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర ప్రదేశ్‌తో ఓటమికి గురైంది. 2018 సీజన్‌లో గ్రూపు బీలో భాగమైన ఢిల్లీ జట్టుతో పాటుగా మధ్య ప్రదేశ్, ఒడిశా, హైదరాబాద్, ఉత్తరప్రదేశ్, కేరళ, సౌరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లు పోటీకి దిగనున్నాయి. ఢిల్లీ జట్టు తన తొలి మ్యాచ్‌ను ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా.. సెప్టెంబరు 20న ఆడనుంది.

50ఓవర్ల ఫార్మాట్‌లో గంభీర్ పెద్దగా రాణించింది లేదు. ఇటీవలే ఇంగ్లాండ్ పర్యటనలో ఆఖరి టెస్టు ఆడిన రిషబ్ పంత్ సెంచరీ ముగించాడు. లండన్‌లోని కెన్నింగ్‌టన్ ఓవల్ స్డేడియ వేదికగా ముగిసిన మ్యాచ్‌లో రాహుల్‌తో కలిసి పంత్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే జట్టులో పంత్‌తో పాటు కీలక ప్లేయర్‌గా నితీశ్ రానా కూడా చేరనున్నాడు. ఐపీఎల్ సీజన్లలో ఇప్పటికే తాను ఆడిన పలు మ్యాచ్ మనం చూశాం.

ఇంకా వారితో పాటుగా ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2012 అండర్ 19 వరల్డ్ కప్‌లో జట్టులో ఒకడైన ఉన్‌ముక్త్ చంద్ తన ప్రతిభను నిరూపించుకునేందుకు చక్కని అవకాశం దక్కించుకున్నాడు. నవ్‌దీప్ షైనీ, కుల్వంత్ ఖేజ్రోలియాలతో ఢిల్లీ జట్టు బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉంది.

ఢిల్లీ జట్టు పూర్తి వివరాలు:
Gautam Gambhir (C), Dhruv Shorey, Unmukt Chand, Rishabh Pant (wk), Nitish Rana, Himmat Singh, Hiten Dalal, Lalit Yadav, Manan Sharma, Pawan Negi, Navdeep Saini, Kulwant Khejroliya, Gaurav Kumar, Sinranjeet Singh, Prashnu Vijayran

స్టాండ్ బై ప్లేయర్లు
Milind Kumar, Prashant Bhandari, Sarthak Ranjan, Varun Sood

Story first published: Monday, September 17, 2018, 16:39 [IST]
Other articles published on Sep 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X