న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాచ్‌ని మలుపు తిప్పిన క్యాచ్: దినేశ్ కార్తీక్‌ అవుట్ (వీడియో)

ఫిరోజ్ షా కోట్లా వేదికగా గురువారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది.

By Nageshwara Rao

హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా గురువారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. సురేశ్ రైనా (77), దినేశ్ కార్తీక్ (65) పరుగులతో రాణించడంతో గుజరాత్ భారీ స్కోరు చేసింది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

ఓపెనర్లు మెకల్లమ్ (1), డ్వేన్ స్మిత్(9) పరుగులకే పెవిలియన్‌కు చేరి నిరాశపరిచారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గుజరాత్ కెప్టెన్ సురేశ్ రైనా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్‌లు అద్భుత ప్రదర్శన చేశారు. ఒకవైపు ఢిల్లీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూనే మరొకవైపు వికెట్లను కాపాడుకుంటూ స్కోరు బోర్డుని పరిగెత్తించారు.

ఈ క్రమంలోనే 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో రైనా అర్ధ సెంచరీని పూర్తి చేరాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన ఆడిన రైనా... షమీ వేసిన 14వ ఓవర్లో జట్టు స్కోరు 143 పరుగుల వద్ద రనౌటయ్యాడు. దీంతో వీరిద్దరి 133 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

Video: Watch Corey Anderson's stunning catch to dismiss Dinesh Karthik

ఆ తర్వాత దినేశ్ కార్తీక్ భారీ షాట్‌కు యత్నించి 34 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 65 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. కమిన్స్ బౌలింగ్‌లో కోరీ అండర్సన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అయితే దినేశ్ కార్తీక్‌ని అవుట్ చేసిన తీరుపై కోరీ అండర్సన్‌‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

కమిన్స్ వేసిన బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్ భారీ షాట్ ఆడేందుకు యత్నించాడు. అయితే మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోరీ ఆండర్సన్ ఆ బంతిని అద్భుతంగా ఎడమ చేత్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులతో పాటు బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ సైతం అవాక్కయ్యాడు.

ఈ అద్భుతమైన క్యాచ్‌కి సంబంధించిన వీడియో మీకోసం:

కాగా, 209 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ మరో 15 బంతులు మిగిలి ఉండగానే 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. ఢిల్లీ యువ క్రికెటర్ రిషబ్ పంత్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 43 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్సర్లతో 97 పరుగులు చేసి అవుటయ్యాడు. బాసిల్ తంపి బౌలింగ్‌లో కీపర్ దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

దీంతో తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. మరో ఆటగాడు సంజూ శాంసన్ కూడా 61 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ సురేశ్ రైనా వేసిన 7వ ఓవర్ రెండో బంతికి సిక్స్ బాదడం ద్వారా ఐపీఎల్ పదో సీజన్‌లో 500వ సిక్స్ కొట్టిన ఆడగాడిగా సంజూ శాంసన్ గుర్తింపు పొందాడు. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ ఆ జట్టు పేరిట ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసినప్పటికీ పరాజయం పాలైంది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X