న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వీడియో వైరల్: వ్యాన్ ఢ్రైవర్‌గా పాక్ మాజీ క్రికెటర్: పీసీబీని ప్రశ్నించిన మహ్మద్ హఫీజ్

Video Viral: Former Pakistan cricketer turns van driver to make a living

హైదరాబాద్: జీవనోపాధి కోసం పాకిస్థాన్‌కు చెందిన ఓ క్రికెటర్ వ్యాన్‌ డ్రైవర్‌గా మారాడు. పాకిస్థాన్‌ దేశవాళీ క్రికెట్‌లో ఆడిన మాజీ క్రికెటర్‌ ఫజాల్‌ షుబాన్‌ తన కుటుంబాన్ని పోషించుకునేందుకు వేరే గత్యంతరం లేక ప్రస్తుతం వ్యాన్‌ని నడుపుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పాకిస్తాన్‌ క్రికెట్‌లో తీసుకొచ్చిన నూతన విధానం వల్ల డిపార్ట్‌మెంటల్‌ క్రికెట్‌కు చరమగీతం పాడారని... దీంతో తన పరిస్థితి ఇలా తయారైందని 31 ఏళ్ల ఫజల్‌ సుభాన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ "జీవనోపాధి కోసం వ్యాన్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నా. పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు తరఫున ఆడటానికి చాలా శ్రమించా" అని అన్నాడు.

పాకిస్తాన్ కీలక ఆటగాళ్లతో నిరాశ చెందిన కోచ్.. ఏమీ చేయలేకపోతున్న కెప్టెన్!!పాకిస్తాన్ కీలక ఆటగాళ్లతో నిరాశ చెందిన కోచ్.. ఏమీ చేయలేకపోతున్న కెప్టెన్!!

"దేశవాళీ క్రికెట్‌లో భాగంగా ఉన్న డిపార్ట్‌మెంటల్‌ క్రికెట్‌లో ఆడా. దాంతో రూ. లక్ష వరకూ జీతంగా వచ్చేది. కానీ వాటిని మూసేయడంతో ఇప్పుడు వ్యాన్‌ డ్రైవర్‌గా మారాల్సి వచ్చింది. ఇప్పుడు నా సంపాదన 30 వేల నుంచి 35 వేల వరకూ మాత్రమే ఉంది. దీంతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉంది. అయినా సంతోషంగానే ఉన్నా" అని ఫజాల్ తెలిపాడు.

ఈ వీడియో వైరల్ కావడంతో పాక్ క్రికెటర్ మహ్మద్‌ హఫీజ్‌ దానిని తన ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ "ఇది చాలా విచారకరం. అతడిలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కొత్త విధానంతో 200 మందికే అవకాశం దక్కుతుంది. ఈ నిర్ణయంతో వేలాది మంది క్రికెటర్లు, ఇతర సహాయక సిబ్బంది ఉపాధి కోల్పోయారు. క్రికెట్‌లో ఇలాంటి వారి బాధ్యతలు ఎవరు తీసుకుంటారో నాకు తెలియదు" అని కామెంట్ పెట్టాడు.

బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా గంగూలీ: సెహ్వాగ్ ట్విట్టర్‌లో ఏమన్నాడో తెలుసా?బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా గంగూలీ: సెహ్వాగ్ ట్విట్టర్‌లో ఏమన్నాడో తెలుసా?

ఇదిలా ఉంటే, సుభాన్‌ మొత్తం 40 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లాడి 2,301 పరుగులు చేయగా 29 లిస్ట్‌ ఏ మ్యాచ్‌ల్లో 659 పరుగులు చేశాడు.

Story first published: Tuesday, October 15, 2019, 17:44 [IST]
Other articles published on Oct 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X