న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిరాజ్ విజృంభణ, ఓటమి అంచుల్లో దక్షిణాఫ్రికా-ఏ

Victory in sight for India A after Siraj burst

హైదరాబాద్: దక్షిణాఫ్రికా-ఎతో తొలి అనధికార టెస్టు మ్యాచ్‌పై భారత్‌-ఎ పట్టు సాధించింది. హైదరాబాద్‌ పేసర్‌ మొహ్మద్‌ సిరాజ్‌ (4/18) మళ్లీ మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగుల భారీ ఆధిక్యాన్ని కూడగట్టుకున్న భారత్‌.. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 77 పరుగులకే 3 వికెట్లు పడగొట్టింది.

తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సౌతాఫ్రికా-ఎను కట్టడి చేసిన సిరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ విజృంభించడంతో నాలుగు రోజుల అనధికార టెస్ట్‌లో భారత్‌-ఎ భారీ విజయం దిశగా పయనిస్తోంది. 338 పరుగుల మొదటి ఇన్నింగ్స్‌ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌతాఫ్రికా-ఎ.. మూడోరోజు ఆట ముగిసేసరికి 99 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. 239 పరుగులు వెనుకంజలో ఉన్న ఆ జట్టుకు 6 వికెట్లే చేతిలో ఉన్నాయి.

అంతకుముందు 411/2తో సోమవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌-ఎ 584/8 స్కోరుతో డిక్లేర్‌ చేసింది. డబుల్‌ సెంచరీ హీరో మయాంక్‌ అగర్వాల్‌ (220) 251 బంతుల్లో 31 ఫోర్లు, 4 సిక్సుల ఓవర్‌నైట్‌ స్కోరుకు ఒక్క పరుగూ జోడించకుండానే వెనుదిరిగాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (37) కూడా ఎక్కువసేపు నిలవలేదు. ఈ స్థితిలో ఆంధ్ర ఆటగాళ్లు హనుమ విహారి (54), వికెట్‌కీపర్‌ శ్రీకర్‌ భరత్‌ (64) హాఫ్ సెంచరీలు సాధించారు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో హెండ్రిక్స్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. బదులుగా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన దక్షిణాఫ్రికాను యువ పేసర్‌ మొహ్మద్‌ సిరాజ్‌ (3/12) వణికించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన అతను.. రెండో ఇన్నింగ్స్‌లో మరింత విజృంభించాడు. ఒక దశలో అతని దెబ్బకు సఫారీ జట్టు 6 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. హంజా (39), ముత్తుస్వామి (33) నిలిచి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తపడ్డారు. సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకే ఆలౌటైంది. మయాంక్‌ అగర్వాల్‌ (220) ఓవర్‌నైట్‌ స్కోరు వద్దే అవుటయ్యాడు. హనుమ విహారి (54), శ్రీకర్‌ భరత్‌ (64) అర్థసెంచరీలు చేశారు.

Story first published: Tuesday, August 7, 2018, 14:31 [IST]
Other articles published on Aug 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X