న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాలీవుడ్ హాస్యనటుడు వేణుమాధవ్ మృతితో షాక్‌కు గురైన 'యూసుఫ్ పఠాన్'!!

Venu Madhav Demise: Star indian Cricketer Yusuf Pathan In Shock

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మృతితో టీమిండియాకు చెందిన ఓ క్రికెటర్ షాక్‌కు గురయ్యాడు. తెలుగు ఆటగాళ్లు వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడు, హనుమ విహారిలు కాకుండా.. గుజరాత్ రాష్ట్రానికి చెందిన టీమిండియా సీనియర్ ఆటగాడు యూసుఫ్ పఠాన్ కావడం ఇక్కడ విశేషం. వేణుమాధవ్ మరణవార్త చూసి షాకైనట్టు తాజాగా యూసుఫ్ పఠాన్ తెలిపాడు. ఈ మేరకు యూసుఫ్ ట్వీట్ చేశాడు.

యువీ ఆవేదన: యో-యో టెస్టు పూర్తిచేసినా జట్టులో అవకాశం ఇవ్వలేదు.. జీవితంలో అదే కీలక మలుపుయువీ ఆవేదన: యో-యో టెస్టు పూర్తిచేసినా జట్టులో అవకాశం ఇవ్వలేదు.. జీవితంలో అదే కీలక మలుపు

షాక్‌కు గురయ్యా:

'వేణు మాధవ్ మరణ వార్త వినగానే షాక్‌కు గురయ్యా. వెండితెరపై నేను చూసిన అత్యుత్తమ హాస్యనటుల్లో వేణుమాధవ్ ఒకరు. తెలుగు చిత్రసీమలో ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి' అని యూసుఫ్ పఠాన్ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వేణుమాధవ్ మీకెలా తెలుసు:

వేణుమాధవ్ మీకెలా తెలుసు:

వేణుమాధవ్ మృతిపై యూసుఫ్ పఠాన్ ట్వీట్ చేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. వేణుమాధవ్ మీకెలా తెలుసు అని కొందరు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే.. వేణుమాధవ్‌తో యూసుఫ్ పఠాన్‌కు ఎలా పరిచయం అయిందన్న విషయం మాత్రం తెలియరాలేదు. తెలుగు స్టార్ హీరోలు నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలను దక్షిణాదిన డబ్ చేస్తుంటారు. తెలుగు డబ్బింగ్ సినిమాలకు హిందీలో చాలా పాపులారిటీ ఉన్న విషయం తెలిసిందే. వేణు నటించిన డబ్బింగ్ సినిమాలను పఠాన్ చూసి ఉండవచ్చునని కొంతమంది భావిస్తున్నారు.

 'సంప్రదాయం' సినిమాతో అరంగేట్రం:

'సంప్రదాయం' సినిమాతో అరంగేట్రం:

గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో బుధవారం మృతి చెందారు. హైదరాబాద్ మౌలాలి స్మశాన వాటికలో గురువారం కుటుంబ సభ్యులు,అభిమానుల అశ్రునయనాల మధ్య వేణుమాధవ్ అంత్యక్రియలు ముగిశాయి. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'సంప్రదాయం' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి వేణుమాధవ్ పరిచయం అయ్యారు. ఆ తర్వాత తొలిప్రేమ, దిల్, సై, లక్ష్మి, ఛత్రపతి లాంటి సినిమాలు అతన్ని హాస్యనటుడిగా నిలబెట్టాయి.

కోరిక తీరకుండానే:

కోరిక తీరకుండానే:

వేణుమాధవ్ మొత్తం 600 సినిమాల్లో నటించారు. వేణుమాధవ్ సినిమాల్లోకి రాకముందు మిమిక్రి ఆర్టిస్ట్. ఎన్నికల సమయంలో కూడా టీడీపీ తరుపున ఆయన పనిచేసారు. అతనికి ఎమ్మెల్యే కావాలని ఎప్పటినుండో కోరిక ఉండేది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో కూడా తెలిపారు. గత ఎన్నికల్లో కోదాడ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి విరమించుకున్నారు. దీంతో ఆ కోరిక అలాగే ఉండిపోయింది.

Story first published: Friday, September 27, 2019, 12:28 [IST]
Other articles published on Sep 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X