న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆమిర్‌ సోహేల్‌ ఫోర్ బాది నన్ను రెచ్చగొట్టాడు.. ఆ నెక్ట్స్ బంతికే వికెట్ తీశా: వెంకటేశ్‌

Venkatesh Prasad recalls face off with Aamer Sohail in 1996 World Cup clash between India and Pakistan

ముంబై: అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు శత్రువుల్లా పోరాడతారు. దాయాదుల మధ్య శత్రుత్వం గురించి చెప్పుకుంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది 1996 ప్రపంచకప్‌‌లో ఆమిర్‌ సొహైల్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌ మధ్య చోటు చేసుకున్న కవ్వింపులు. ఎప్పటికీ అందరికీ గుర్తుండే సన్నివేశమది. సుమారు 24 ఏళ్ల తర్వాత ఆనాటి సంఘటనను వెంకటేశ్‌ ప్రసాద్ మరోసారి గుర్తుచేసుకున్నాడు.

గంగూలీ మంచి జట్టుని ధోనీకి ఇస్తే.. మహీ మాత్రం కోహ్లీకి అలా ఇవ్వలేదు: గంభీర్ ఫైర్గంగూలీ మంచి జట్టుని ధోనీకి ఇస్తే.. మహీ మాత్రం కోహ్లీకి అలా ఇవ్వలేదు: గంభీర్ ఫైర్

మాటల యుద్ధం:

మాటల యుద్ధం:

తాజాగా భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌తో ఓ ఆన్‌లైన్‌ కార్యక్రమంలో మాట్లాడిన మాజీ పేసర్ వెంకటేశ్‌ ప్రసాద్..‌ పాకిస్థాన్‌ మాజీ సారథి ఆమిర్‌ సోహేల్‌తో జరిగిన వివాదాస్పద స్లెడ్జింగ్‌ గురించి వివరించాడు. 1996 ప్రపంచకప్‌లో బెంగళూరులో పాకిస్థాన్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో తమ ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగిందని, సోహేల్‌ తన బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన మరుసటి బంతికే అతడిని ఔట్‌ చేశానని చెప్పాడు. పాకిస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ ఎవరైనా భారత బౌలర్లపై చెలరేగడం తనకు నచ్చదని, ఆ సమయంలో తాను ప్రశాంతంగా ఉండడం చాలా కష్టమని వెంకీ చెప్పాడు.

చేతి వేళ్లతో సైగలు చేశాడు:

చేతి వేళ్లతో సైగలు చేశాడు:

'అది 1996 ప్రపంచకప్.. బెంగళూరులో పాకిస్థాన్‌తో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్.‌ 15వ ఓవర్‌లో నేను బౌలింగ్‌ చేస్తుండగా.. ఆమిర్‌ సోహేల్‌ ఎక్స్‌ట్రా కవర్‌ దిశగా ఓ బౌండరీ బాదాడు. నేనా షాట్‌ను అస్సలు ఊహించలేదు. ఎంతో కీలక మ్యాచ్ కావడంతో ఈ పోరును ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకిస్తోంది. ఆమిర్‌ ఫోర్‌ కొట్టాక బ్యాట్‌ను బౌండరీ వైపు చూపించి చేతి వేళ్లతో సైగలు చేశాడు. తర్వాతి బంతికి ఇంకో ఫోర్‌ కొడతానని, మళ్లీ వెళ్లి తెచ్చుకో అన్నట్టు ఎగతాళి చేశాడు. దాంతో ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. అప్పుడు నా మదిలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి' అని వెంకటేశ్‌ ప్రసాద్ తెలిపాడు.

ఆధిపత్యం చెలాయిస్తే నచ్చదు:

ఆధిపత్యం చెలాయిస్తే నచ్చదు:

'నా మీద ఏ బ్యాట్స్‌మన్‌ ఆధిపత్యం చెలాయించినా నాకు నచ్చదు. నా మనస్తత్వం అలాంటిది. ఎవరైనా అలా చేస్తే వెంటనే వారికి తిరిగివ్వాలనుకునేవాడిని. అప్పుడే ఆమిర్‌ను ఔట్‌ చేయాలని నిర్ణయించుకున్నా. దాంతో బ్యాట్స్‌మన్‌కు బంతి అందకుండా వికెట్ టు వికెట్‌ వేయాలనుకున్నా. నా కోపాన్ని అదుపులో ఉంచుకొని అలాగే చేశా. తర్వాతి బంతికే సోహేల్‌ బౌల్డయ్యాడు' అని మాజీ పేసర్‌ వివరించాడు. వికెట్ పడగానే ఒక్కసారిగా పట్టరాని ఆవేశంతో వెంకటేశ్ ప్రసాద్ 'బాస్టర్డ్... గో హోమ్' అంటూ పెవిలియన్ వైపు దారి చూపించాడు. వెంకటేశ్ భారత్ తరఫున 33 టెస్టులు, 161 వన్డే మ్యాచ్‌లు ఆడాడు.

39 పరుగుల తేడాతో ఓటమి:

39 పరుగుల తేడాతో ఓటమి:

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్.. పాకిస్థాన్‌ ముందు 288 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూ (93) ఆకట్టుకున్నాడు. లక్ష్య ఛేదనలో పాక్‌ ధాటిగా ఆరంభించిడంతో ఆ జట్టు తేలిగ్గా గెలిచేలా అనిపించింది. ముఖ్యంగా ఓపెనర్‌ ఆమిర్‌ సోహేల్ ‌(55) ధాటిగా ఆడాడు. అతడు 15వ ఓవర్‌లో ఔటయ్యాక పాక్‌ క్రమంగా వికెట్లు కోల్పోయింది. సోహేల్‌ ఔటవ్వడంతోనే మ్యాచ్‌ మలుపు తిరిగింది. చివరికి పాక్ 9 వికెట్ల నష్టానికి 248 రన్స్ చేసి 39 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

Story first published: Tuesday, July 14, 2020, 20:25 [IST]
Other articles published on Jul 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X