న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెలెక్టర్‌ షార్ట్‌లిస్ట్‌లో ప్రసాద్‌, శివరామకృష్ణన్‌.. అగార్కర్‌కు షాక్!!

Venkatesh Prasad, Laxman Sivaramakrishnan Among 5 Shortlisted For BCCI Selectors Job

ముంబై: బీసీసీఐ నూతన సెలక్టర్ల ఎంపిక ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది. సెలెక్టర్‌ పోస్ట్‌ ఇంటర్వ్యూల కోసం బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) ఐదుగురితో ఓ జాబితాను కుదించింది. వీరిలో ప్రధానంగా మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ నిలిచాడు. షార్ట్‌లిస్ట్‌ జాబితాలో మాజీ పేసర్ అజిత్ అగార్కర్‌కు చోటు దక్కలేదు. మొదటి నుంచి చీఫ్ సెలక్టర్ రేసులో లక్ష్మణ్ శివరామకృష్ణన్, అజిత్ అగార్కర్ మధ్యే తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉందని అందరూ అనుకున్నా.. చివరకు షార్ట్‌లిస్ట్‌లో అగార్కర్‌ పేరు లేకుండా పోయింది.

కోహ్లీసేన ఆటలో క్రమశిక్షణ చూపించలేకపోయింది.. మాజీల అసంతృప్తి!!కోహ్లీసేన ఆటలో క్రమశిక్షణ చూపించలేకపోయింది.. మాజీల అసంతృప్తి!!

ఐదుగురితో తుది జాబితా:

ఐదుగురితో తుది జాబితా:

మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణ నాయక్‌లతో కూడిన సీఏసీ బృందం మంగళవారం సమావేశమై.. సెలెక్టర్‌ పదవి కోసం వచ్చిన 44 దరఖాస్తులను పరిశీలించారు. అందులోంచి వెంకటేశ్‌ ప్రసాద్‌, సునీల్‌ జోషి, లక్ష్మణ్ శివరామకృష్ణన్‌, హర్విందర్‌ సింగ్‌, రాజేశ్‌ చౌహాన్‌ల పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేసింది. ఈ ఐదుగురికి బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఏసీ బృందం ఇంటర్వ్యూలు చేయనున్నారు.

అగార్కర్‌ పేరును పరిశీలించాం కానీ:

అగార్కర్‌ పేరును పరిశీలించాం కానీ:

'సీఏసీ బృందం అజిత్ అగార్కర్ పేరును పరిశీలించింది. కానీ.. చివరికి ప్రసాద్‌, జోషి, లక్ష్మణ్, హర్విందర్‌, రాజేశ్‌లను సీఏసీ షార్ట్ లిస్ట్ చేసింది. మిగతా ముగ్గురు (జతిన్ పరంజ్‌పే, సరన్‌దీప్ సింగ్ మరియు దేవాన్ గాంధీ) సెలెక్టర్ల పదవీకాలం ముగిసినప్పుడు అగార్కర్ పేరు పరిగణించవచ్చు' అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి పీటీఐకి చెప్పారు.

జోనల్ విధానమే ప్రధాన కారణం:

జోనల్ విధానమే ప్రధాన కారణం:

అగార్కర్‌ను షార్ట్‌లిస్ట్ చేయకపోవడానికి జోనల్ విధానమే ప్రధాన కారణం అని సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే జతిన్‌ పరాంజపె వెస్ట్‌జోన్‌ నుంచి ఉన్నారు. ముంబైకి చెందిన అగార్కర్‌ ఎంపికైతే వెస్ట్‌జోన్‌ నుంచి కమిటీలో ఇద్దరు ఉంటారు. అతిపెద్ద దేశంలో ప్రాంతాలనూ పరిగణనలోకి తీసుకుంటామని గతంలో బీసీసీఐ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో అగార్కర్‌కు అవకాశం లేకుండా పోయింది.

సెలెక్టర్‌ రేసులో ప్రసాద్‌:

సెలెక్టర్‌ రేసులో ప్రసాద్‌:

జూనియర్ సెలెక్షన్ ప్యానెల్‌లో భాగమైన వెంకటేష్ ప్రసాద్‌కు ఇప్పటికే కొంత అనుభవం ఉంది కనుక అతడే సెలెక్టర్‌ రేసులో ముందు వరుసలో ఉన్నాడని సమాచారం. 50 ఏళ్ల ప్రసాద్‌ భారత్ తరపున 33 టెస్టులు, 161 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 96, వన్డేల్లో196 వికెట్లు తీశారు. ఇక 50 ఏళ్ల శివరామకృష్ణన్‌ 9 టెస్టులు, 16 వన్డేలు ఆడారు. హర్విందర్ మూడు టెస్టులు, 16 వన్డలు .. చౌహాన్ 21 టెస్టులు, 35 వన్డేలు.. జోషి 15 టెస్టులు, 69 వన్డేలు ఆడారు.

Story first published: Wednesday, March 4, 2020, 8:52 [IST]
Other articles published on Mar 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X