న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2018: పంజాబ్ బౌలింగ్ కోచ్‌గా వెంకటేశ్‌ ప్రసాద్‌

By Nageshwara Rao
Venkatesh Prasad Appointed Bowling Coach at Kings XI Punjab

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ కోసం టీమిండియా మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ప్రాంఛైజీ బౌలింగ్‌ కోచ్‌గా నియమించుకుంది. బీసీసీఐ జూనియర్‌ చీఫ్‌ సెలక్టర్‌ పదవికి రాజీనామా చేసిన రెండు రోజులకే పంజాబ్ బౌలింగ్ కోచ్ పదవి ఆయన్ను వరించింది.

బీసీసీఐ జూ. సెలక్షన్ కమిటీకి వెంకటేశ్ ప్రసాద్ రాజీనామాబీసీసీఐ జూ. సెలక్షన్ కమిటీకి వెంకటేశ్ ప్రసాద్ రాజీనామా

ఐపీఎల్‌ 11వ సీజన్‌ సందర్భంగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు ఆదివారం తమ సపోర్టింగ్ స్టాఫ్‌ను ప్రకటించింది. 'టీమిండియా మాజీ పేసర్‌, బీసీసీఐ జూనియర్‌ నేషనల్‌ సెలక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ను జట్టు బౌలింగ్‌ కోచ్‌గా నియమించాం' అని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

బీసీసీఐ జూనియర్‌ చీఫ్‌ సెలక్టర్‌ పదవికి శుక్రవారం వెంకటేశ్ ప్రసాద్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వెళ్లే ఆలోచనలో భాగంగానే... పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు రాకూడదనే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్టు స్పష్టమైంది. గత 30 నెలలుగా వెంకటేశ్ ప్రసాద్ జూనియర్‌ చీఫ్‌ సెలక్టర్‌ పదవిలో ఉన్నారు. వ్యక్తిగత కారణాల రీత్యానే రాజీనామా చేస్తున్నట్టు ప్రసాద్‌ ప్రకటించారు.

అంతకముందు పంజాబ్ జట్టు హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్‌ హడ్జ్‌ను నియమించిన సంగతి తెలిసిందే. రాబోయే మూడు సీజన్లకు బ్రాడ్ హెడ్ కోచ్‌గా ఉంటారు. టీ20ల్లో 7000 పరుగులకు పైగా సాధించిన హడ్జ్‌.... జట్టు మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్‌ నేతృత్వంలో కీలక మార్పులు చేసి ముందుకు నడిపించగలడని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇక, ఢిల్లీ మాజీ ఆటగాడు మిథున్ మన్హాస్‌ సహాయక కోచ్‌గా కండిషనింగ్ కోచ్‌గా నిషాంత్ ఠాకూర్, టెక్నికల్ కోచ్‌గా శ్యామల్ వల్లభ్‌జీ, ఫీల్డింగ్ కోచ్‌గా నిషాంత బోర్డోలోయ్‌ వ్యవహారించనున్నారు. వెంకటేశ్‌ ప్రసాద్‌ బౌలింగ్‌ కోచ్‌గా తమ బృందంలో చేరినందుకు సెహ్వాగ్‌ ఆనందం వ్యక్తం చేశాడు.

సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌‌గా వెంకటేశ్ ప్రసాద్ స్థానంలో అశీష్ కపూర్సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌‌గా వెంకటేశ్ ప్రసాద్ స్థానంలో అశీష్ కపూర్

వీళ్ల సేవలు జట్టుకు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఐపీఎల్ 11వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుని అశ్విన్‌ నడిపించనున్నాడు. ఇటీవలే అతడిని కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే.

Story first published: Sunday, March 4, 2018, 17:34 [IST]
Other articles published on Mar 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X