న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా బౌలింగ్ కోచ్ రేసులో మాజీ బౌలర్

Venkatesh Prasad Applies For The Job Of Bowling Coach || Oneindia Telugu
Venkatesh Prasad Applies For The Job Of Bowling Coach

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. టీమిండియా హెడ్ కోచ్‌తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ సహా పలు ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది నియామకానికి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

ఇంగ్లాండ్ ఛాంప్స్, ఆసీస్ చీట్స్: యాషెస్‌లో తొలిరోజే ఇంగ్లీషు ఫ్యాన్స్ ఎగతాళిఇంగ్లాండ్ ఛాంప్స్, ఆసీస్ చీట్స్: యాషెస్‌లో తొలిరోజే ఇంగ్లీషు ఫ్యాన్స్ ఎగతాళి

కోచ్‌ల దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి తేదీని జులై 30గా బీసీసీఐ నిర్ణయించింది. దీంతో పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఇక, వెంకటేశ్ ప్రసాద్ విషయానికి వస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 161 వన్డేలాడి 196 వికెట్లు, టెస్టుల్లో 33 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు తీశారు. 2007-09 మధ్య కాలంలో టీమిండియాతో కలిసి పనిచేశారు.

జూనియర్ జట్టుకు చీఫ్ సెలక్టర్‌గా

జూనియర్ జట్టుకు చీఫ్ సెలక్టర్‌గా

మూడేళ్ల పాటు జూనియర్ జట్టుకు చీఫ్ సెలక్టర్‌గా కూడా విధులు నిర్వహించారు. గతేడాది కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుతో ఒప్పందం కుదరడంతో పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో భాగంగా తన చీఫ్ సెలక్టర్‌ పదవికి రాజీనామా చేశారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లకు బౌలింగ్ కోచ్‌గా కూడా పనిచేశారు.

హెడ్ కోచ్ పదవికి మొత్తం రెండు వేల దరఖాస్తులు

హెడ్ కోచ్ పదవికి మొత్తం రెండు వేల దరఖాస్తులు

ఇదిలా ఉంటే, టీమిండియా హెడ్ కోచ్ పదవికి మొత్తం రెండు వేల దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది. ఈ మేరకు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో కథనం ప్రచురించింది. టీమిండియా హెడ్ కోచ్ రేసులో ప్రస్తుత కోచ్ రవిశాస్త్రితోపాటు మాజీ క్రికెట‌ర్లు మ‌హేళా జ‌య‌వ‌ర్ద‌నేతో పాటు గ్యారీ కిర్‌స్టన్‌, టామ్‌ మూడీ, మైక్ హెస్సన్‌లతో పాటు న్యూజిలాండ్ మాజీ, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ప్రస్తుత కోచ్ మైక్ హెస్సన్ కూడా దరఖాస్తు చేసుకున్నాడని తెలుస్తోంది.

ఫీల్డింగ్ కోచ్ పదవి కోసం జాంటీ రోడ్స్ దరఖాస్తు

ఫీల్డింగ్ కోచ్ పదవి కోసం జాంటీ రోడ్స్ దరఖాస్తు

శ్రీలంక మాజీ కెప్టెన్‌, ముంబయి ఇండియన్స్‌ కోచ్‌ మహేలా జయవర్ధనే తొలుత ఈ పదవిపై ఆసక్తి కనబర్చినా ఇప్పుడు దరఖాస్తు చేయకపోవడం గమనార్హమని ఆ పత్రిక వెల్లడించింది. ఇక, భారత్ నుంచి మాజీ క్రికెటర్లు రాబిన్‌సింగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్‌లు కూడా ఇటీవలే ఈ పదవికి దరఖాస్తు చేశారు. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ పదవి కోసం దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ జాంటీ రోడ్స్ దరఖాస్తు చేశాడు.

విండిస్ పర్యటన ముగిసేవరకు పొడిగింపు

విండిస్ పర్యటన ముగిసేవరకు పొడిగింపు

ప్రస్తుతం కోచ్‌లుగా పనిచేస్తున్న వారితోపాటు ఇతర సిబ్బందిని కూడా బీసీసీఐ విండిస్ పర్యటన ముగిసేవరకు కొనసాగించనుంది. ఇక మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన క్రికెట్ సలహా కమిటి(సీఏసీ) కొత్త కోచ్‌ను ఎంపిక చేయనుంది. ఈ కమిటీలో మాజీ క్రికెట‌ర్లు క‌పిల్ దేవ్‌, మాజీ మెన్స్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్, మహిళా జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామిల‌ు సభ్యులుగా ఉన్నారు.

Story first published: Thursday, August 1, 2019, 19:10 [IST]
Other articles published on Aug 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X