న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: హర్భజన్‌ మాటలు విని షాక్‌కు గురయ్యా.. నిజం చెప్పాలంటే నేను నమ్మలేదు: వెంకటేశ్‌

Venkatesh Iyer says I did not believe Harbhajan Singhs prediction ahead of 2nd half of IPL 2021

జైపూర్: ఐపీఎల్ స్టార్ వెంకటేశ్ అయ్యర్‌కు 2021 కలిసొచ్చిందనే చెప్పాలి. తన తొలి ఐపీఎల్‌ సీజన్‌లోనే అదరగొట్టిన వెంకటేశ్‌కు ఏకంగా భారత జట్టులో ఆడే అవకాశం దక్కింది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన లెఫ్ట్‌ఆర్మ్‌ బ్యాటర్, కుడిచేతి వాటం మీడియం పేసర్‌ వెంకటేశ్ భారత్‌ జట్టు తరఫున టీ20ల్లోకి బుధవారం అరంగేట్రం చేశాడు. కివీస్‌తో తొలి మ్యాచ్‌లో బౌలింగ్‌ చేయని అయ్యర్.. బ్యాటింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మలిచాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో రెండో బంతికే ఔట్ అయిపోయాడు. అయితే కీలకమైన ఆఖరి ఓవర్‌లో వెంకీ ఫోర్‌ కొట్టడంతో రిషబ్ పంత్‌పై ఒత్తిడితగ్గిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఐపీఎల్ 2021 రెండు దశల్లో జరిగిన విషయం తెలిసిందే. ఈసారి వెంకటేశ్ అయ్యర్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. యూఏఈ వేదికగా జరిగిన రెండో దశలో వెంకటేశ్‌ దుమ్మురేపాడు. కోల్‌కతా ఫైనల్‌కు దూసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. కేకేఆర్‌ తరఫున 10 మ్యాచ్‌లు ఆడిన వెంకటేశ్‌.. 128 స్ట్రైక్‌రేట్‌తో 370 పరుగులు చేశాడు. అందులో నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 67. ఇక బౌలింగ్‌లోనూ మూడు వికెట్లను పడగొట్టాడు. అయితే గత ఐపీఎల్‌లో తన ప్రదర్శనపై భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ ముందే అంచనా వేశాడని వెంకటేశ్‌ తెలిపాడు.

ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్‌ఫోతో వెంకటేశ్ అయ్యర్ మాట్లాడుతూ... 'ఐపీఎల్‌ 2021 ప్రారంభానికి ముందే హర్భజన్‌ సింగ్ నాతో సూటిగా చెప్పేశాడు. అయితే అప్పటికి నేను తుది జట్టులో ఉంటానో లేదో కూడా తెలియదు. భజ్జీ నన్ను నెట్‌ ప్రాక్టీస్‌ సెషన్స్‌లో చూసి ఉంటాడమో. "ఈసారి కోల్‌కతా అంటే నువ్వే. నాకు ఆ నమ్మకం ఉంది. మీకు అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా నిరూపించుకుంటావ్" అని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యా. నిజం చెప్పాలంటే అసలు నేను నమ్మలేదు. అసలు ప్రాక్టీస్‌లో నా బ్యాటింగ్‌ కూడా చూసి ఉండడు. ఎందుకు భజ్జీ ఈ విధంగా చెబుతున్నాడు అని కూడా ఆలోచించా. హర్భజన్‌లోని మంచి వ్యక్తిత్వం నన్ను ఓదార్చడం కోసమే ఇలా చెప్పిందేమో అనుకున్నా' అని తెలిపాడు.

ఐపీఎల్‌ 2021లో రాణించి కేకేఆర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించినందుకు సంతోషపడినట్టు వెంకటేశ్ అయ్యర్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 14 సీజన్‌లో హర్భజన్‌ సింగ్ కూడా కేకేఆర్‌ జట్టులోనే ఉన్న విషయం తెలిసిందే. రాంచీ వేదికగా శుక్రవారం జరిగే రెండో టీ20లో పర్యాటక కివీస్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటుంది. ఈ మ్యాచులో అయినా వెంకటేశ్ అయ్యర్ చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఐపీఎల్ ఫామ్ వెంకీ కొనసాగిస్తాడో లేదో చూడాలి.

Story first published: Thursday, November 18, 2021, 22:14 [IST]
Other articles published on Nov 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X