న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నువ్వు పనికిరావ్?: కించపరిచిన షేన్ వార్న్‌కు ఉస్మాన్ ఖవాజా కౌంటర్!

 Usman Khawaja tells Shane Warne to look at his record


హైదరాబాద్: ఆస్ట్రేలియా జట్టులో కొనసాగాలంటే అప్పుడప్పుడు చేసే ప్రదర్శనలు సరిపోవంటూ ఉస్మాన్ ఖవాజా పట్ల ఆసీస్ స్పిన్ లెజెండ్ వ్యంగ్యంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టు తరుపున టెస్టు ఓపెనర్‌గా రాణిస్తోన్న ఉస్మాన్ ఖవాజా గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో స్వదేశంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ నుంచి ఉస్మాన్ ఖవాజాను సెలక్టర్లు తప్పించారు. దీంతో సెలక్టర్ల నిర్ణయంపై షేన్ వార్న్ "నీవు అప్పుడప్పుడు ఆడే ఏవో కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆసీస్‌ జట్టులో కొనసాగడానికి ఉపయోగపడవు. ఆసీస్‌ జట్టులో ఆడాలంటే ఎటువంటి ప్రదర్శన చేయాలో తెలుసుకో. ఖవాజాను తప్పిస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం మంచిదే" అని అన్నాడు.

IPL 2020: 21 ఏళ్ల యువ క్రికెటర్ కోసం ముంబై, చెన్నై పోటీ: ఎవరీ టామ్ బాంటన్?IPL 2020: 21 ఏళ్ల యువ క్రికెటర్ కోసం ముంబై, చెన్నై పోటీ: ఎవరీ టామ్ బాంటన్?

షేన్ వార్న్ వ్యాఖ్యలపై ఉస్మాన్ ఖవాజా కాస్తంత ఘాటగానే స్పందించాడు. ఖవాజా మాట్లాడుతూ "వార్న్‌ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను బ్యాట్స్‌మన్‌. నాకు పరుగులు చేయడం మాత్రమే తెలుసు. అదే నాకు కరెన్సీతో సమానం. నా రికార్డులు చూసి మాట్లాడితే బాగుంటుంది. నా షీల్డ్‌ రికార్డు చూశావా?" అని మండిపడ్డాడు.

"దేశవాళీ క్రికెట్‌లో నా వన్డే రికార్డు నీకు తెలుసా. ఆస్ట్రేలియా తరఫున నేను సాధించిన రికార్డు చూడు. అలాగే బీబీఎల్‌ రికార్డును కూడా. నేను పరుగులు మాత్రమే చేశాను. ఆ రికార్డులే నా గురించి చెబుతాయి. నువ్వు ఏదో సలహా చెబితే నా బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకోవాల్సిన అవసరం లేదు" అని ఖవాజా గట్టిగానే మాట్లాడాడు.

ఆస్ట్రేలియా తరఫున ఆడటం మానేశారా? అని అడిగిన ప్రశ్నకు ఖవాజా మాట్లాడుతూ "లేదు. ఏదో ఒకరోజు నేను రిటైర్మెంట్ ప్రకటిస్తా. ఎప్పుడూ అత్యున్నత స్థాయిలో ఆడాలనే లక్ష్యం ఉంటుంది. నేను అంతర్జాతీయ స్థాయిలో ఉన్నట్లు భావిస్తున్నాను, కానీ, నేను పరుగులు చేయాల్సి ఉంది. నేను పరుగులు సాధిస్తే, మిగిలినవి తనంతట అవే చూసుకుంటాయి" అని వెల్లడించాడు.

ప్రస్తుతం పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో చోటు దక్కకపోవడంతో ఉస్మాన్ ఖవాజా ప్రస్తుతం దేశవాళీ టోర్నీలో క్వీన్స్ లాండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా గబ్బా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 5 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 25, 2019, 16:11 [IST]
Other articles published on Nov 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X