న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఐపీఎల్ 2018 క్రెడిట్ అంతా రషీద్‌ఖాన్ కొట్టేస్తాడు'

Unique Rashid Khan will have big impact on IPL 2018: Sunrisers Hyderabad coach Tom Moody

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ లోనే కాదు, ఐపీఎల్ లోనూ రషీద్ ఖాన్ సత్తా చాటుతున్నాడు. ఈ నేపథ్యంలో అతనిని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కోచ్ తెగపొగిడేస్తున్నాడు. ఈ ఐపీఎల్‌లో అత్యంత ప్రభావం చూపే ఆటగాడిగా నిలుస్తాడని రషీద్ ఖాన్ గురించి ఆ జట్టు కోచ్‌ టామ్‌ మూడీ అభిప్రాయపడ్డాడు. ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టామ్‌.. రషీద్‌ ఖాన్‌ను ప్రశంసిస్తూ ఆకాశానికెత్తాడు.

 రోజు రోజుకి.. టోర్నీటోర్నీకి పెరుగుతూ:

రోజు రోజుకి.. టోర్నీటోర్నీకి పెరుగుతూ:

‘రషీద్‌ స్థిరత్వం కలిగిన ఆటగాడు. గత సీజన్‌లో అతను మాతో కలిసి విజయవంతంగా రాణించాడు. అతని బలం రోజు రోజుకి.. టోర్నీటోర్నీకి పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని టోర్నీల్లో ఆడుతూ అద్భుతంగా రాణిస్తున్నాడు. అలాగే తన దేశం తరపున కూడా ఇరగదీస్తున్నాడు. మా గేమ్‌ ప్రణాళికలో అతను అత్యంత ముఖ్యమైన బౌలర్‌. మా ప్రణాళిక దగ్గట్టు వికెట్లు తీయడంలో అతను దిట్టా.' అని ఈ యవక్రికెటర్‌ని ఆస్ట్రేలియన్‌ మాజీ ఆటగాడు కొనియాడాడు.

17 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లోకి రషీద్‌ఖాన్‌:

17 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లోకి రషీద్‌ఖాన్‌:

17 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రషీద్‌ఖాన్‌ అనతి కాలంలోనే ప్రపంచ అత్యత్తుమ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఐసీసీ టీ20, వన్డే ర్యాంకుల్లో తొలి స్థానాన్ని సాధించాడు. 2019 ప్రపంచకప్‌ టోర్నీకి అఫ్గనిస్తాన్‌ అర్హత సాధించడంలో సారథిగా కీలక పాత్ర పోషించాడు. గత సీజన్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఈ యువ ఆటగాడు.. తనదైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈసీజన్‌లో వరుస విజయాలతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దూకుడు మీద ఉన్న విషయం తెలిసిందే.

 విలియమ్సన్‌ అనుభవమున్న కెప్టెన్

విలియమ్సన్‌ అనుభవమున్న కెప్టెన్

ఇక విలియమ్సన్‌ కెప్టెన్సీపై స్పందిస్తూ.. ‘కేన్‌ విలియమ్సన్‌ అనుభవమున్న కెప్టెన్. అతను అంతర్జాతీయ జట్టుకు సారథ్యం వహించాడు. అతనికి నాయకత్వంలో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవడం తెలుసు. తొలుత కెప్టెన్‌కు తన వ్యక్తిత్వం, బలాలపై నమ్మకం ఉండాలి. విలియమ్సన్‌ అలానే కొనసాగుతున్నాడు. మేం కూడా అతన్ని ఆ విధంగానే ప్రోత్సహిస్తున్నామని' టామ్‌ మూడీ తెలిపాడు.

ఓటమెరుగకుండా దూసుకుపోతూ:

ఓటమెరుగకుండా దూసుకుపోతూ:

ఐపీఎల్ 11 సీజన్ మొదలైనప్పటి నుంచి మూడు మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమెరుగకుండా దూసుకుపోతోంది. ఈ క్రమంలో తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 19 గురువారం పంజాబ్ జట్టుతో పంజాబ్ వేదికగా ఆడనుంది.

Story first published: Tuesday, April 17, 2018, 18:34 [IST]
Other articles published on Apr 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X