బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో కూడా భారత జట్టు టాస్ ఓడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పింది. తమ జట్టులో ఒక మార్పు చేసినట్లు బంగ్లా సారధి లిటాన్ దాస్ చెప్పాడు. హసన్ మహమూద్ స్థానంలో నాసున్ అహ్మద్ ఆడుతున్నట్లు వెల్లడించాడు. అదే సమయంలో భారత జట్టులో రెండు మార్పులు చేసినట్లు రోహిత్ శర్మ తెలిపాడు.
టాస్ గెలిస్తే ఏం చేసేవాడిననే విషయం గురించి తాను ఆలోచించాలని అనుకోవడం లేదని రోహిత్ అన్నాడు. అక్షర్ పటేల్ ఫిట్‌గా ఉన్నాడని, షెహబాజ్ అహ్మద్ స్థానంలో ఆడుతున్నాడని చెప్పాడు. అలాగే తొలి వన్డేలో అరంగేట్రం చేసిన కుల్దీప్ సేన్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడని వెల్లడించిన రోహిత్.. అతని స్థానంలో జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకున్నట్లు తెలిపాడు.
తొలి వన్డేలో చేసిన పొరపాట్లు మళ్లీ రిపీట్ చేయకుండా ఉండటం గురించి, అలాగే ఒక్కో బౌలర్‌ను ఎలా ఎదుర్కోవాలనే విషయాలే తాము చర్చించుకున్నామని రోహిత్ చెప్పాడు. అంతేకానీ, ఓటమి గురించి పెద్దగా తమ జట్టులో చర్చ జరగలేదని స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్‌లో అందరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తారని అనుకుంటున్నట్లు చెప్పాడు.
తొలి వన్డే అనంతరం తనకు వెన్ను నొప్పిగా ఉందని కుల్దీప్ సేన్ చెప్పినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ కారణంగానే అతను రెండో వన్డేకు అందుబాటులో లేనట్లు వెల్లడించింది. మొదటి మ్యాచ్ జరిగిన మైదానంలోనే వేరే పిచ్‌పై ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే బ్యాటింగ్‌కు బాగుంటుందని, బ్యాటర్లకు మరింత టైమింగ్ దొరుకుతుందని వివరించారు. మరి ఈ అవకాశాన్ని బంగ్లా బ్యాటర్లు ఉపయోగించుకొని భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచుతారేమో చూడాలి.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.
బంగ్లాదేశ్ జట్టు: నజిముల్ హొస్సేన్ షాంటో, లిటాన్ దాస్ (కెప్టెన్), అనాముల్ హక్, షకీబల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, ఆఫిఫ్ హొస్సేన్, మెహదీ హసన్ మిరాజ్, నాసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఎబాదత్ హొస్సేన్