న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆటగాళ్లను ఆటపట్టించిన అంపైర్‌.. వీడియో చూస్తే నవ్వులే!!

Umpire raises finger after LBW appeal, ends up scratching nose in Big Bash League


మెల్‌బోర్న్‌: మ్యాచ్ జరుగుతున్నపుడు సహచర ఆటగాళ్లు ఆటపట్టించుకోవడం సహజం. ప్రత్యర్థి ఆటగాళ్లను కూడా ప్లేయర్లు ఆటపట్టింస్తుంటారు. ఒక్కోసారి అంపైర్లను ఆటగాళ్లు సరదాగా ఆడుకుంటారు. అయితే ప్లేయర్లను అంపైర్ ఆటపట్టించడం చాలా అరుదు. కానీ.. తాజాగా ఇదే ఘటన బిగ్‌బాష్‌ లీగ్‌లో చోటుచేసుకుంది.

న్యాయం కోసం పోరాడుతున్నా.. మేరీకోమ్‌కు వ్యతిరేకంగా కాదు: నిఖత్‌న్యాయం కోసం పోరాడుతున్నా.. మేరీకోమ్‌కు వ్యతిరేకంగా కాదు: నిఖత్‌

ఎల్బీ కోసం రషీద్‌ అప్పీలు:

ఎల్బీ కోసం రషీద్‌ అప్పీలు:

బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌, అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. 17వ ఓవర్‌లో రషీద్‌ ఖాన్‌ వేసిన మూడో బంతి మెల్‌బోర్న్‌ బ్యాట్స్‌మన్‌ వెబ్‌స్టర్‌ షాట్ ఆడగా.. బంతి కాస్త అతని ప్యాడ్‌లకు తగిలింది. వెంటనే ఎల్బీడబ్ల్యూ కోసం రషీద్‌ అప్పీలు చేశాడు. అంపైర్‌ గ్రెగ్ డేవిడ్సన్‌ ఔట్‌గా వేలు పైకెత్తి.. వెంటనే తన ముక్కుని రుద్దుకున్నాడు.

ఔట్‌ ఇవ్వలేదు.. ముక్కుని రుద్దుకున్నా:

ఔట్‌ ఇవ్వలేదు.. ముక్కుని రుద్దుకున్నా:

అంపైర్‌ నిర్ణయాన్ని పూర్తిగా గమనించని అడిలైడ్‌ ఆటగాళ్లు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. రషీద్‌ సహచర ఆటగాళ్లతో సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. వెంటనే ఆటగాళ్లకు అంపైర్‌ సైగ చేసాడు. 'నేను ఔట్‌ అని ప్రకటించలేదు, కేవలం నా ముక్కుని రుద్దుకున్నా' అని సైగలు చేసాడు. అంపైర్‌ చేసిన సరదా పనికి ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు.

ఫన్నీ అంపైర్‌:

ఫన్నీ అంపైర్‌:

మ్యాచ్‌లో ఇలా అంపైర్‌ ఆటగాళ్లను ఆటపట్టించడం కొత్తగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'ఫన్నీ అంపైర్‌' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'సూపర్ అంపైర్‌' అని మరో అభిమాని కామెంట్ చేసాడు. ఈ ఘటన జరిగినప్పుడు కామెంటేటర్లు కూడా నవ్వులు పూయించారు.

అడిలైడ్‌ విజయం:

అడిలైడ్‌ విజయం:

తొలుత బ్యాటింగ్‌ చేసిన అడిలైడ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (51) హాఫ్ సెంచరీ చేయగా.. అలెక్స్ కారీ (41) రాణించాడు. అనంతరం బరిలోకి దిగిన మెల్‌బోర్న్‌ 137 పరుగులే చేసి ఓడిపోయింది. ఆరోన్ ఫించ్ (50) హాఫ్ సెంచరీ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. రషీద్‌ ఖాన్‌ (25, 2/15)కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' దక్కింది.

సరదాగా అనిపించింది:

మ్యాచ్‌ అనంతరం అంపైర్‌ ఘటన గురించి రషీద్‌ ఖాన్‌ మాట్లాడాడు. 'బ్యాట్స్‌మన్‌ ఔట్‌ అని సెలబ్రేషన్స్‌ మొదలుపెట్టాను. అంపైర్‌ ముక్కుని రుద్దుకున్నాని చెప్పడంతో ఆశ్చర్యపోయా. తర్వాత రిప్లేలో చూశాక ఎంతో సరదాగా అనిపించింది' అని అన్నాడు. ఈ మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్‌ 'క్యామెల్‌ బ్యాట్‌' ఉపయోగించాడు.

Story first published: Monday, December 30, 2019, 11:39 [IST]
Other articles published on Dec 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X