న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టైగా ముగిసిన మ్యాచ్‌లో ఉమేశ్‌కు చెత్త రికార్డు

Umesh Yadav registers unwanted record in tie match

హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా పేసర్‌ ఉమేశ్ యాదవ్ ఓ చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. పది ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన ఉమేశ్‌ డెబ్బైకి పైగా పరుగులివ్వడం. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్ల పాటు బౌలింగ్‌ వేసిన ఉమేశ్‌ యాదవ్‌ వికెట్‌ మాత్రమే తీసి 78 పరుగుల్ని సమర్పించుకున్నాడు. ఫలితంగా వన్డే ఇన్నింగ్స్‌ల్లో అత్యధిసార్లు 70కి పైగా పరుగులిచ్చిన ఆటగాళ్ల జాబితాలో ఉమేశ్‌ రెండో స్థానాన్ని ఆక్రమించాడు.

డెబ్భైకి పైగా మలింగా 17, ఉమేశ్‌ 12సార్లు:

డెబ్భైకి పైగా మలింగా 17, ఉమేశ్‌ 12సార్లు:

ఇదే వరుసలో ఉమేశ్ కంటే ముందు స్థానంలో మలింగ ఉన్నాడు. ఇక‍్కడ శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగా తొలి స్థానంలో ఉండగా, ఉమేశ్‌ రెండో స్థానంలో నిలిచాడు. మలింగా 17 సార్లు డెబ్భైకి పైగా పరుగుల్ని ఇవ్వగా, ఉమేశ్‌ 12సార్లు డెబ్భై అంతకంటే పరుగుల్ని సమర్పించుకున్నాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషిద్‌(11) మూడో స్థానంలో ఉన్నాడు.

షై హోప్‌ సరికొత్త రికార్డు:

షై హోప్‌ సరికొత్త రికార్డు:

విండీస్‌ ఆటగాడు షై హోప్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. లక్ష్య ఛేదనలో భాగంగా టైగా ముగిసిన మ్యాచ్‌ల్లో అజేయంగా అత్యధిక వ్యక్తిపరుగులు సాధించిన జాబితాలో షై హోప్‌ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ సయ్యిద్‌ అన్వర్‌(103 నాటౌట్‌) ఉన్న రికార్డును హోప్‌ బ్రేక్‌ చేశాడు. 1995లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో అన్వర్‌ అజేయంగా సెంచరీ సాధించగా, ఆ మ్యాచ్‌ టైగా ముగిసింది.

 లక్ష్య చేధనలో కోహ్లీ రెండో వాడిగా:

లక్ష్య చేధనలో కోహ్లీ రెండో వాడిగా:

టైగా ముగిసిన వన్డేల పరంగా చూస్తే అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. వన్డే ఫార్మాట్‌లో టైగా ముగిసిన మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ ఆండ్రూ స్ట్రాస్‌(158) తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాత కోహ్లిదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.

రెండో వన్డేను టైగా ముగిస్తే:

రెండో వన్డేను టైగా ముగిస్తే:

మొదట భారత్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 321 పరుగులు సాధించింది. అంబటి రాయుడు (73; 80 బంతుల్లో 8ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అనంతరం విండీస్‌ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి సరిగ్గా 321 పరుగులు చేసింది. హోప్‌ (123 నాటౌట్‌; 134 బంతుల్లో 10ఫోర్లు, 3సిక్సులు), హెట్‌మయర్‌ (94; 64 బంతుల్లో 4ఫోర్లు, 7సిక్సులు) వీరోచిత ఇన్నింగ్స్‌లతో అలరించారు. ఆఖరి బంతికి హోప్‌ బౌండరీ బాదడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది.

Story first published: Thursday, October 25, 2018, 14:13 [IST]
Other articles published on Oct 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X