ఐపీఎల్‌లో చరిత్రలోనే తొలిసారి: ఉమేశ్ యాదవ్ చెత్త రికార్డు

Posted By:
Umesh Yadav has conceded 50+ runs in an IPL match 5 times - the most by any bowler

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 19 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 218 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ బ్యాటింగ్‌లో ఆఖరి ఓవర్లలో సంజూ శాంసన్ ఫోర్లు, సిక్సులతో చెలరేగాడు. తాను ఆడిన చివరి ఏడు బంతుల్లో 39 పరుగులు రాబట్టాడు. మరో ఎండ్‌లో రాహుల్ త్రిపాఠి కూడా (5 బంతుల్లో 14), జోస్ బట్లర్ (14 బంతుల్లో 23) కూడా వేగంగా పరుగులు రాబట్టారు.

చివరి మూడు ఓవర్లలో చెలరేగిన సంజూ శాంసన్

చివరి మూడు ఓవర్లలో చెలరేగిన సంజూ శాంసన్

ముఖ్యంగా సంజూ శాంసన్ చివరి మూడు ఓవర్లలో చెలరేగాడు. ఆఖరి ఓవర్లలో సంజూ సిక్సర్లే బాదడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 10 సిక్సర్లు బాదిన సంజూ శాంసన్ జట్టు స్కోరును 200 దాటించాడు. ఇంకో రెండు మూడు బంతులుంటే సెంచరీ కూడా పూర్తయ్యేది. ఉమేశ్ యాదవ్ వేసిన ఆఖరి ఓవర్లో రాజస్థాన్ జట్టు 27 పరుగులు రాబట్టింది.

ఒక్క ఓవరే బెంగళూరు కొంప ముంచింది

ఒక్క ఓవరే బెంగళూరు కొంప ముంచింది

ఈ ఒక్క ఓవరే బెంగళూరు కొంప ముంచింది. ఉమేశ్ యాదవ్ ధారళంగా పరుగులు సమర్పించుకోవడంతో రాజస్థాన్ 200 పరుగుల మైలురాయిని అందుకోగలిగింది. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన ఉమేశ్ ఒక్క వికెట్ కూడా పడగొట్టకుండా 59 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో ఉమేశ్ యాదవ్ ఓ చెత్తరికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

50కిపైగా పరుగులు ఇవ్వడం ఐదోసారి

ఉమేశ్ యాదవ్ ఐపీఎల్‌లో 50కిపైగా పరుగులు ఇవ్వడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. ఐపీఎల్ చరిత్రలో మరే బౌలర్ కూడా ఇన్నిసార్లు 50కిపైగా పరుగులు సమర్పించుకోలేదు. అశోక్ దిండా మాత్రం నాలుగుసార్లు 50కిపైగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పుడు ఆ రికార్డుని ఉమేశ్ యాదవ్ అధిగమించాడు.

బెంగళూరుపై రాజస్థాన్ ఘన విజయం

బెంగళూరుపై రాజస్థాన్ ఘన విజయం

218 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 198 పరుగులు చేసింది. దీంతో బెంగళూరుపై రాజస్థాన్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు సంజు శాంసన్(92 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో రాజస్థాన్ 4 వికెట్లకు 217 పరుగులు చేసింది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 16, 2018, 11:28 [IST]
Other articles published on Apr 16, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి