న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'మైదానం బయట ఉండాలని ఎవరనుకుంటారు.. పునరాగమనం చేయాలనుంది'

Umesh Yadav Eyes Comeback To limited-overs Cricket, Calls Selectors Best Judge

ముంబై: మైదానం బయట కూర్చోవాలని మాత్రం ఎవరికి ఉంటుంది?. నేను కూడా మనిషినే. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మళ్లీ పునరాగమనం చేయాలనుంది. అందుకోసం చాలా కష్టపడుతున్నా అని భారత సీనియర్‌ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ పేర్కొన్నాడు. 2029 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఒకే మ్యాచ్‌ ఆడిన ఉమేశ్‌.. దాదాపు ఏడాది కాలంగా మరో పరిమిత ఓవర్ల క్రికెట్‌ మ్యాచ్ ఆడలేదు.

<strong>సూపర్‌ ఓవర్‌లో బుమ్రానే ఎందుకు.. అసలు కారణం చెప్పిన రోహిత్!!</strong>సూపర్‌ ఓవర్‌లో బుమ్రానే ఎందుకు.. అసలు కారణం చెప్పిన రోహిత్!!

పునరాగమనం చేయాలనుంది

పునరాగమనం చేయాలనుంది

తాజాగా ఉమేష్ ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'మైదానం బయట కూర్చోవాలని మాత్రం ఎవరికి ఉంటుంది?. నేను కూడా మనిషినే. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మళ్లీ పునరాగమనం చేయాలనుంది. అందుకోసం చాలా కష్టపడుతున్నా. ఇక న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ కోసం ఎదురుచూస్తున్నా. కచ్చితంగా సెలెక్టర్లు నన్ను ఎంపిక చేస్తారనే నమ్మకం ఉంది. ఒకవేళ ఎంపికైతే.. వందశాతం కష్టపడతా. రాణిస్తాననే నమ్మకం ఉంది. నా లైన్‌ అండ్‌ లెంగ్త్‌పై చాలా కసరత్తు చేశా' అని తెలిపాడు.

బుమ్రా, షమీలతో మంచి అనుబంధం ఉంది

బుమ్రా, షమీలతో మంచి అనుబంధం ఉంది

'జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, ఇషాంత్‌ శర్మలతో మంచి అనుబంధం ఉంది. వారందరితో కలిసి ఆడటం గర్వంగా ఉంటది. మేమంతా 140 కిమీ వేగంతో బంతులు వేస్తాం. బాగా రాణిస్తూ వికెట్లు పడగొడుతున్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అత్యుత్తమ ప్రదర్శన చేయగలం. అదే మమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. ఒకర్ని ఒకరు ప్రశంసించుకుంటాం. మా ఆలోచనలను పంచుకుంటాం. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం బాగుంది' అని ఉమేష్ అన్నాడు.

2015 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు:

2015 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు:

2015 ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉమేష్ నిలిచాడు. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు. జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మొహమ్మద్ షమీ లాంటి సీనియర్లు.. దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, నవ్‌దీప్‌ సైనీ వంటి యువకులు వచ్చాక అతడికి అవకాశాలు తగ్గాయి. చివరగా ఉమేశ్‌ 2018లో వెస్టిండీస్‌పై వన్డే మ్యాచ్‌ ఆడాడు.

10 బంతుల్లోనే 31 పరుగులు:

10 బంతుల్లోనే 31 పరుగులు:

ఇటీవలి కాలంలో ఉమేశ్ బౌలింగ్‌లోనే కాదు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఉమేశ్ సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 10 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. దీంతో అనేక రికార్డులు కూడా బద్దలు కొట్టాడు. ఉమేశ్ ఇప్పటి వరకు భారత్ తరపున 45 టెస్టులు (142 వికెట్లు), 75 వన్డేలు (106 వికెట్లు), 7 టీ20 (9 వికెట్లు)లు ఆడాడు.

Story first published: Friday, January 31, 2020, 11:27 [IST]
Other articles published on Jan 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X