న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అండర్‌-19 ప్రపంచకప్‌.. సెమీస్‌లో భారత్‌ X పాక్‌!!

U-19 World Cup: Pakistan set up semi-final vs India after win over Afghanistan

బెనోని (దక్షిణాఫ్రికా): అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. ఈ నెల 4 (మంగళవారం)న జరిగే తొలి సెమీస్‌లో టీమిండియాతో పాకిస్తాన్‌ తలపడుతుంది. శుక్రవారం జరిగిన చివరి క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో పాక్‌ 6 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. దీంతో అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది.

అసలైన క్రేజీ గేమ్ ఇదే.. సూపర్‌ ఓవర్‌పై రవిశాస్త్రి ఆనందం!!అసలైన క్రేజీ గేమ్ ఇదే.. సూపర్‌ ఓవర్‌పై రవిశాస్త్రి ఆనందం!!

ఆఫ్ఘన్‌పై పాక్‌ గెలుపు:

ఆఫ్ఘన్‌పై పాక్‌ గెలుపు:

ముందుగా బ్యాటింగ్‌కు చేసిన అఫ్గాన్‌ 49.1 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఫర్హాన్‌ జఖీల్‌ (40) టాప్‌ స్కోరర్‌. పాక్ బౌలర్ ఆమిర్‌ ఖాన్‌కు 3 వికెట్లు దక్కాయి. లక్ష ఛేదనలో పాక్‌ 41.1 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేసిన మొహమ్మద్‌ హురైరా (76 బంతుల్లో 64; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ చేసి 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచాడు. హురైరాను అఫ్గాన్‌ బౌలర్‌ నూర్‌ అహ్మద్‌ 'మన్కడింగ్‌' ద్వారా రనౌట్‌ చేయడం ఈ మ్యాచ్‌లో వివాదం రేపింది.

ఆస్ట్రేలియాపై విజయం:

ఆస్ట్రేలియాపై విజయం:

అఫ్గానిస్థాన్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో పాకిస్థాన్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో.. పాక్ గ్రూప్‌-బిలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు క్వార్టర్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించిన యువ భారత్‌ గ్రూప్‌-ఏలో టాపర్‌గా నిలిచింది. దీంతో ఇరు జట్లు మంగళవారం సెమీ ఫైనల్లో తలపడనున్నాయి.

2018లో భారీ విజయం:

2018లో భారీ విజయం:

2018 అండర్‌-19 ప్రపంచకప్‌లో దయాది జట్లు తలపడ్డాయి. పృథ్వీ షా నేతృత్వం వహించిన ఆ మ్యాచ్‌లో యువ భారత్‌ 203 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. శుభ్‌మన్‌ గిల్‌ సెంచరీ చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 272/9 పరుగులు చేసింది. అనంతరం పాకిస్థాన్‌ 69 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని చవిచూసింది.

నాలుగు సార్లు ప్రపంచకప్‌:

నాలుగు సార్లు ప్రపంచకప్‌:

అండర్‌-19 మెగా టోర్నీల్లో భారత్‌ అత్యధికంగా నాలుగు సార్లు ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 2000, 2008, 2012, 2018లో యువ భారత్‌ ప్రపంచకప్‌లను కైవసం చేసుకుంది. 2008లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలోని జట్టు కప్ సాధించింది. అదే ఏడాది కోహ్లీ జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసాడు. మరోవైపు పాకిస్థాన్‌ 2004, 2006లో మెగా కప్పులను సొంతం చేసుకుంది.

Story first published: Saturday, February 1, 2020, 11:49 [IST]
Other articles published on Feb 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X