న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హ్యాండ్స్‌‌కోంబ్‌కు మొండిచేయి: ఆసీస్ సెలక్టర్లపై మండిపడుతోన్న నెటిజన్లు

Twitterati feel bad for Peter Handscomb as Australia leave him out of the World Cup squad

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్ కోసం మొత్తం 15 మందితో కూడిన ఆటగాళ్ల జాబితాను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టార్ ప్లేయర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఏడాది నిషేధం తర్వాత తిరిగి ఆస్ట్రేలియా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరి కోసం పీటర్ హ్యాండ్స్‌కోంబ్, పేస్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్‌ను పక్కన పెట్టారు. గత కొంతకాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పీటర్ హ్యాండ్స్‌‌కోంబ్‌కు ఆస్ట్రేలియా సెలక్టర్లు మొండిచేయి చూపడంపై నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

హ్యాండ్స్‌కోంబ్ అత్యుత్తమ ప్రదర్శన

ఈ ఏడాది భారత్‌లో ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో పీటర్ హ్యాండ్స్‌కోంబ్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. మొత్తం ఐదు మ్యాచ్‌ల్లో 47.20 యావరేజి, స్ట్రైక్ రేట్ 92తో 236 పరుగులు నమోదు చేశాడు. దీంతో పాటు ఈ సిరిస్‌లో అత్యధిక పరుగులు నమోదు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లోనే తన తొలి సెంచరీని సాధించాడు.

ఆస్ట్రేలియా జట్టు విజయాల్లో కీలకపాత్ర

ఆ తర్వాత యూఏఈ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌లో సైతం ఆస్ట్రేలియా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. అయినప్పటికీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇక, ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌లో రాణించిన ఉస్మాన్‌ ఖవాజాతో పాటు షాన్‌ మార్ష్‌కు చోటు దక్కడం విశేషం. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.

వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా జట్టు:

ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), బెహ్ఫాన్‌డార్ఫ్, అలెక్స్‌ కేరీ(వికెట్‌ కీపర్‌), నాథన్ కౌల్టర్‌నైల్‌, కమిన్స్‌, ఉస్మాన్‌ ఖవాజా, నాథన్‌ లయాన్‌, షాన్‌ మార్ష్‌, గ్లెన్ మాక్స్‌వెల్‌, రిచర్డ్‌ సన్‌, మిచెల్ స్టార్క్‌, మార్కస్ స్టొయినీస్‌, డేవిడ్ వార్నర్‌, స్టీవ్ స్మిత్‌, ప్యాట్ కమ్మిన్స్, ఆడమ్‌ జంపా

Story first published: Monday, April 15, 2019, 15:10 [IST]
Other articles published on Apr 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X