న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Jaffer vs Vaughan Twitter War: వాళ్లిద్దరి మధ్య మళ్లీ లొల్లి షురూ.. వాన్ గెలికిండు.. జాఫర్ ఇచ్చిపడేసిండు

Twitter war started again between Michael vaughan and Wasim Jaffer Ahead Of Eng vs Ind 5th test

ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖెల్ వాన్, టీమిండియా మాజీ టెస్ట్ క్రికెటర్ వసీం జాఫర్‌‌ల మధ్య గతంలో ట్విట్టర్ వేదికగా వాదోపవాదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక వీరిరువురి మధ్య మరోసారి ట్విట్టర్‌లో లొల్లి షురూ అయింది. ఇంగ్లాండ్‌తో 5వ టెస్ట్ జులై 1న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ ప్రారంభం ముందు వీరిద్దరు ఒకరినొకరు కవ్వించుకునేలా ట్వీట్స్ చేసుకున్నారు.

ఇక ముందు వాన్‌ ఓ సెటైరికల్ ట్వీట్‌తో గెలకగా.. జాఫర్ సైతం అంతకంటే సెటైరికల్ ట్వీట్‌తో వాన్ దూల తీర్చాడు. గతంలో జాఫర్‌-వాన్‌ల మధ్య జరిగిన ట్విట్టర్ వార్ క్రికెట్‌ ఫాలోవర్లకు కావాల్సినంత ఫన్ అందించగా.. ఈసారి కూడా అది రిపీట్ అవుతుందేమో మరీ.

ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్న వసీం జాఫర్.. జూన్‌ 21వ తేదీన అంటే మంగళవారం లార్డ్స్‌ స్టేడియంలో ఓ ఫొటో దిగి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. సన్ ఇజ్ షైనింగ్.. వెదర్ ఇజ్ స్వీట్ అంటూ క్రికెట్ పుట్టినిల్లు అయి లార్డ్స్ స్టేడియాన్ని హోమ్ ఆఫ్ క్రికెట్ అనే హ్యాష్‌టాగ్ ఇస్తూ.. ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పట్ల మైఖెల్ వాన్ వాన్‌ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. ఏంటీ జాఫర్.. నేను తొలి టెస్ట్‌ వికెట్‌ తీసుకొని 20సంవత్సరాలు అయిన శుభసందర్భంగా ఆ మూమెంట్ గుర్తుచేసుకుంటూ ఇక్కడికి వచ్చావా అంటూ జాఫర్‌ ట్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ కామెంట్‌ చేశాడు. వాన్ స్వతహాగా బ్యాటర్.

కానీ తాను బౌలింగ్లో వికెట్ తీసినందుకు ఇలా వచ్చావా అంటూ దెప్పి పొడిచాడు. ఇక జాఫర్ ఏమాత్రం ఊరుకోలేదు. బోడీ నీ వికెట్ కోసం ఇక్కడిదాకా ఎందుకొస్తాననేలా.. జాఫర్‌ తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చాడు.

2007లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. ఆ పర్యటనలో టెస్ట్‌ సిరీస్‌ గెలిచింది. ఆ సిరీస్ గెలిచి 15సంవత్సరాలు అవుతున్నందున దాన్ని గుర్తుచేసుకుంటూ ఈ ఫోటో దిగాను.. అంటూ అప్పుడు టీమిండియా సిరీస్ విజయ ఫోటోతో పాటు జాఫర్ ట్వీట్ చేస్తూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో వాన్‌ నాలుక్కరుచుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. జాఫర్‌.. సరైన విధంగా వాన్‌కు ట్వీట్‌మెంట్ ఇచ్చాడు అంటూ అతని ఫాలోవర్లు కామెంట్లతో హల్ చల్ చేస్తున్నారు. ఇకపోతే ఇంగ్లాండ్ మీద ఇండియా టెస్ట్ జట్టు చివరిసారి 2007లో సిరీస్‌ గెలిచింది. ఆ సిరీస్‌‌కు మిస్టర్ డిపెండబుల్ రాహుల్‌ ద్రావిడ్‌ సారథ్యం వహించాడు. 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 1-0తో గెలుపొంది చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది.

Story first published: Wednesday, June 22, 2022, 14:14 [IST]
Other articles published on Jun 22, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X