న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సన్‌రైజర్స్‌తో మ్యాచ్: ఇషాన్ కిషన్ కావాలంటూ నెటిజన్ల ట్వీట్లు (వీడియో)

 Twitter wants Mumbai Indians to bring in Ishan Kishan against Sunrisers Hyderabad

హైదరాబాద్: ముంబై ఇండియన్స్ మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన జట్టు. అయితే, ఈ సీజన్‌లో మాత్రం గెలుపు కోసం ఆపసోపాలు పడుతోంది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట ఓడి... రెండింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

చెన్నైపై విజయం సాధించిన ముంబై

చెన్నైపై విజయం సాధించిన ముంబై

చివరగా సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 6న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

ఇషాన్ కిషన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలి

ఇషాన్ కిషన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలి

ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌తో శనివారం జరగనున్న మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని ముంబై అభిమానులు కోరుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ఈ సీజన్‌లో ముంబై తరుపున ఇషాన్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఇషాన్ కిషన్ సెంచరీలతో చెలరేగాడు.

సయ్యద్ ముస్తాక్ టోర్నీలో రెండు సెంచరీలు

సయ్యద్ ముస్తాక్ టోర్నీలో రెండు సెంచరీలు

జమ్మూ కాశ్మీర్, మణిపూర్ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో సెంచరీలతో చెలరేగాడు. గత సీజన్‌లో ఇషాన్ కిషన్‌ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం రూ. 6.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. గత సీజన్‌లో 22.91 యావరేజితో 275 పరుగులు చేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ చేసిన 62 పరుగులే ఐపీఎల్ అత్యధికం కావడం విశేషం.

Story first published: Friday, April 5, 2019, 18:57 [IST]
Other articles published on Apr 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X