న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భజ్జీ నోరు మూయించేలా పాండ్యా ప్రదర్శన: నెటిజన్ల ట్వీట్లు, వైరల్

By Nageshwara Rao
Twitter slams Harbhajan Singh for being harsh on Hardik Pandya after second Test

హైదరాబాద్: నాటింగ్‌హామ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఐదు వికెట్లు తీసి విమర్శకుల నోర్లు మూయించాడు టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా జరిగిన మొదటి రెండు టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేసిన పాండ్యా మూడో టెస్టులో విజృంభించాడు.

ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా శనివారం ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ప్రారంభమైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో పాండ్యా కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను భారత బౌలర్లు 161 పరుగులకే ఆలౌట్ చేసి మూడో టెస్టులో పట్టు సాధించారు.

ప్రస్తుత టెస్టు సిరిస్‌కు హర్భజన్ సింగ్ కామెంటేటర్‌గా విధులు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. లార్డ్స్ టెస్టు ముగిసిన తర్వాత మాజీ దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్‌తో పోలుస్తున్నప్పటికీ.. హార్దిక్ పాండ్యా అసలు ఆల్‌రౌండరే కాదని హర్భజన్ సింగ్ ఎద్దేవా చేశాడు.

Twitter slams Harbhajan Singh for being harsh on Hardik Pandya after second Test

'ఇంగ్లిష్ ఆల్‌రౌండర్లు బెన్ స్టోక్స్, శామ్ కర్రాన్, క్రిస్ వోక్స్‌లతో పోలిస్తే.. పాండ్య చాలా వెనుకబడి ఉన్నాడని భజ్జీ అభిప్రాయపడ్డాడు. ఆల్‌రౌండర్ అంటే స్టోక్స్, కర్రాన్ తొలి టెస్టులో ఎలా ఆడారో.. లార్డ్స్‌లో వోక్స్ ఎలా ఆడాడో.. అలా ఆడాలి. హార్దిక్ నుంచి కూడా అదే ఆశించాం. అతడు ఓవర్‌నైట్‌లో కపిల్ దేవ్ కాలేడు. అతడికి ఉన్న ఆల్‌రౌండర్ ట్యాగ్ తొలగించాల'ని భజ్జీ సూచించాడు.

1
42376

తాజాగా, మూడో టెస్టులో పాండ్యా తన అద్భుత ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించాడు. తన టెస్టు కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో పాండ్యా ఐదు వికెట్లు తీయడమిదే తొలిసారి. దీంతో పాండ్యా ఆల్ రౌండరే కాదంటూ వ్యాఖ్యలు చేసిన హర్భజన్ సింగ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.

Story first published: Monday, August 20, 2018, 17:29 [IST]
Other articles published on Aug 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X