
హైదరాబాద్: న్యూజిలాండ్ జట్టు చరిత్ర సృష్టించింది. 1969 తర్వాత మొట్టమొదటిసారి పాకిస్థాన్‌పై టెస్టు సిరిస్‌ను నెగ్గింది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకుని అరుదైన ఘనత సాధించింది. అబుదాబి వేదికగా పాక్‌తో జరిగిన మూడో టెస్టులో ఆతిథ్య జట్టుపై 123 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది.
నాలుగో రోజైన శుక్రవారం 280 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 156 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఓపెనర్లు ఇమామ్ ఉల్-హక్(22), మొహమ్మద్ హఫీజ్ (8) శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. అనంతరం క్రీజులోకి వచ్చిన అజర్ అలీ(5), హరీస్ సోహైల్(9) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అసాద్ షఫీక్ డకౌట్‌గా వెనుదిరిగగా... కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(28), ఆసిఫ్(12), యాసిర్ షా(4), హసన్ అలీ(4), షహీన్ అఫ్రిది(2) పరుగులకే ఔటయ్యారు. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్లలో బాబర్ అజాం(51) ఒక్కడే హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇక, న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, విలియమ్, అజీజ్ పటేల్ తలో మూడు వికెట్లు తీసుకోగా... డి గ్రాండ్ హోమ్‌కు ఒక వికెట్ లభించింది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో రాణించిన కెప్టెన్ కేన్ విలియమ్సన్(139)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా... యాసిర్ షాకు ప్లేయర్ ఆఫ్ ద సిరిస్ అవార్డు లభించింది.
స్కోరు వివరాలు:
తొలి ఇన్నింగ్స్:
న్యూజిలాండ్ - 274
పాకిస్థాన్ - 348
రెండో ఇన్నింగ్స్:
న్యూజిలాండ్ - 353/7 డిక్లేర్
పాకిస్థాన్ - 156
మ్యాచ్ ఫలితం: 123 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం.
పాకిస్థాన్‌పై టెస్టు సిరిస్‌ను నెగ్గిన న్యూజిలాండ్‌పై ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురుస్తోంది.