న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీకి దూకుడెక్కువ.. అందరికీ అందుకే నచ్చుతాడేమో..: టిమ్ పైనె

India vs Australia : Tim Paine Defends Virat Kohli’s Attitude
India vs Australia: Tim Paine defends Virat Kohli’s attitude, says it makes the Indian skipper a crowd-puller

మెల్‌బోర్న్‌: పెర్త్ వేదికగా ఆసీస్-భారత్‌ల మధ్య రెండో టెస్టు ముగిసి రోజులు దాటిపోతుంది. అయినప్పటికీ మ్యాచ్‌లో రెండు, మూడు రోజుల పాటు కొనసాగిన కెప్టెన్ టిమ్ పైన్, కెప్టెన్ కోహ్లీల వివాదం గురించి రోజుకొకరు స్పందిస్తూనే ఉన్నారు. పదేపదే విమర్శలు చేస్తూ మరి కొందరు కోహ్లీకి మద్ధతుగా నిలుస్తూనే ఉన్నారు. మరో రెండ్రోజుల్లో మూడో టెస్టు మెల్‌బౌర్న్ వేదికగా మొదలుకానున్న నేపథ్యంలో ఆసీస్ కెప్టెన్ మరోసారి దాని గురించి మాట్లాడాడు. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీతో జరిగిన వాగ్యుద్ధాన్ని తానెంతగానో ఆస్వాదించానని అంటున్నాడు. పెర్త్‌ వేదికగా ఇరుజట్ల కెప్టెన్ల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆసీస్‌ మీడియా, మాజీలు విరాట్‌పై విమర్శల వర్షం కురిపించారు.

అది మ్యాచ్ వరకే పరమితమంటూ

అది మ్యాచ్ వరకే పరమితమంటూ

మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడిన పైనె అది కేవలం మ్యాచ్‌లో భాగంగా జరిగిందేనని దాని గురించి మర్చిపోయానని చెప్పాడు. టిమ్‌తో పాటు కోహ్లీ కూడా వ్యక్తిగత దూషణలకు దిగనంత వరకూ దానిని హద్దుమీరలేదనే చెప్పాలి. ఇది కేవలం కవ్వింపు చర్య మాత్రమే. అని కొట్టిపరేశాడు. ఇప్పుడు టిమ్‌పైన్‌ ఇందుకు భిన్నంగా స్పందించాడు. వారిద్దరి వివాదం గురించి సోమవారం మీడియాతో మాట్లాడాడు.

నాకెలాంటి కోపమూ లేదు

నాకెలాంటి కోపమూ లేదు

‘పెర్త్‌ వేదికగా మొదలైన మా ఇద్దరి మధ్య గొడవను చాలా వరకూ ఆస్వాదించా. కోహ్లీని ఎప్పట్నుంచో గమనిస్తున్నా. అతడి ఆటతీరు నాకెంతో ఇష్టం. ఇప్పుడు అలాంటి వ్యక్తితోనే కెప్టెన్‌గా తలపడుతున్నా. కోహ్లీ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేటప్పుడు స్పందించిన తీరుపై నాకెలాంటి కోపం లేదు. అందరి కెప్టెన్లలాగే కోహ్లీ కూడా ఆలోచిస్తున్నాడు. ఆటకు ప్రాణం పెడుతున్నాడు. అందరిలా తను కూడా ఓటమిని ఒప్పుకోడు.

కోహ్లీని మెచ్చుకోకుండా ఉండలేను

కోహ్లీని మెచ్చుకోకుండా ఉండలేను

మ్యాచ్‌ గెలవాలన్న కసి అతడిలో ఎక్కువ కనిపిస్తుంది. కోహ్లీలో ఉండే ఆ లక్షణమే నాకిష్టం. కోహ్లీ వ్యక్తిగతంగా నాకు తెలీదు. ఆటలో అతడి దూకుడు, ఆటతీరు, క్రికెట్‌ నైపుణ్యాలను మెచ్చుకోకుండా ఉండలేను. అందువల్లే అందరూ కోహ్లీని ఇష్టపడతారనుకుంటా. అందుకే కోహ్లీకి అభిమానులు ఎక్కువని నా అభిప్రాయం' అని కోహ్లీపై పైన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు.

మెల్‌బౌర్న్ వేదికగా మూడో టెస్టులో

మెల్‌బౌర్న్ వేదికగా మూడో టెస్టులో

మరో రెండు రోజుల్లో ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. మెల్‌బౌర్న్ మైదానం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. పెర్త్ మాదిరిగానే ఈ స్టేడియంలో కూడా పచ్చిక ఉండేలా చర్యలు తీసుకున్నట్లు క్యూరేటర్ తెలిపాడు. మూడో టెస్టుకు భారత జట్టులో కీలకమార్పులు చోటుచేసుకోనున్నాయి.

Story first published: Monday, December 24, 2018, 13:26 [IST]
Other articles published on Dec 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X